Rajath kumar: తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోంది: రజత్ కుమార్

తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోందని, గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోందని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎమ్‌బీ) దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్.

Rajath kumar: తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోంది: రజత్ కుమార్

Rajath Kumar Ias

rajath kumar: తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోందని, గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోందని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎమ్‌బీ) దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్. బుధవారం జీఆర్ఎమ్‌బీ పదమూడో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శితోపాటు, ఏపీకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన చానాకా-కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటనగరం పంప్‌హౌజ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చించారు.

Telangana : తెలంగాణ దేశానికే దిశనిర్ధేశం చూపుతోంది : మంత్రి హరీశ్ రావు

తెలంగాణవైపు నుంచి ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలు క్లియర్‌గా ఉన్నాయని, ఆ వివరాల్ని కేంద్ర జల వనరుల సంఘానికి పంపినట్లు రజత్ కుమార్ చెప్పారు. అయితే, ఆంధ్రప్రదేశ్ కొన్నింటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, కానీ వాటిని జీఆర్ఎమ్‌బీ ఛైర్మన్ రిజెక్ట్ చేశారని చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్‌పై సబ్ కమిటీ ద్వారా అన్ని వివరాలు అధ్యయనం చేసి రిపోర్ట్ అందజేస్తారని వెల్లడించారు. గోదావరి నీటిని ఏపీ, కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోందని, దీనిలో భాగంగా తెలంగాణకు 45 టీఎంసీలు రావాలని రజత్ కుమార్ సూచించారు. సీలేరు ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ వాటాపై కూడా చర్చించినట్లు, జీఆర్ఎమ్‌బీ ఛైర్మన్ ఎంపీ సింగ్ అన్ని విషయాలపై పరిశీలిస్తామని చెప్పినట్లు రజత్ కుమార్ వెల్లడించారు.