Gorantla Madhav : టీడీపీ, బీజేపీ అగ్ర నాయకులపై ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు

హిందూపురం వైసీపీ ఎంపీ కురువ గోరంట్ల మాధవ్ తన శైలిలో టీడీపీ, బీజేపీ నాయకులపై వ్యాఖ్యలు చేశారు. అబద్దాల షా, అడ్డాలేని నడ్డా అంటూ బీజేపీ అగ్రనేతలపై సెటైర్లు వేశారు.

Gorantla Madhav : టీడీపీ, బీజేపీ అగ్ర నాయకులపై ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు

kuruva gorantla madhav

Updated On : June 14, 2023 / 1:46 PM IST

Kuruva Gorantla Madhav : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం (Hindupur) వైసీపీ ఎంపీ కురువ గోరంట్ల మాధవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ పాదయాత్ర (Lokesh Padayatra), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహియాత్ర, ముసలోడు (చంద్రబాబు) కాశీయాత్ర చేసినా జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) జైత్రయాత్రను ఆపలేరంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేశ్ పాదయాత్రకు జనాలు రావడం లేదని, వచ్చిన జనాలతో మాట్లాడటానికి లోకేశ్ నోరు తిరగడం లేదని ఎద్దేవా చేశారు. ఇదేం కర్మరా బాబు అని లోకేశ్ పారిపోతుంటే మొలతాడు పట్టుకొని లాగి పాదయాత్ర చేయిస్తున్నాడు చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు.

అబద్దాల షా, అడ్డానేని నడ్డా
బీజేపీ నాయకులపైనా ఎంపీ మాధవ్ విమర్శలు గుప్పించారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి కలిసి అబద్దాల షా, అడ్డాలేని నడ్డా, అసత్యకుమార్ లను పిలిపించి మాట్లాడించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన అమిత్ షా, జేపీ నడ్డా.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

చంద్రబాబు బండారం పెద్దిరెడ్డికి తెలుసు: కాపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. హెరిటేజ్ నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తోందని.. చంద్రబాబు రైతులను, ప్రజలను రెండు వైపులా దోపిడీ చేస్తున్నారని అనంతపురంలో ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బండారం మొత్తం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలుసని అన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబుతో సహా మొత్తం అందరిని ఓడించి రాష్ట్రంలో 175కి 175 సీట్లు సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు.

Also Read: అమిత్ షా, జేపీ నడ్డా తీవ్ర ఆరోపణలు చేసినా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు