Kinjarapu Atchannaidu : అమిత్ షా, జేపీ నడ్డా తీవ్ర ఆరోపణలు చేసినా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు- అచ్చెన్నాయుడు

Kinjarapu Atchannaidu : దేశంలోనే ధనవంతుడైన సీఎంగా రికార్డ్ సృష్టించిన జగన్ పేదవాడా? ఏడు బంగళాలు కట్టుకున్న జగన్ పేదవాడా?

Kinjarapu Atchannaidu : అమిత్ షా, జేపీ నడ్డా తీవ్ర ఆరోపణలు చేసినా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు- అచ్చెన్నాయుడు

Kinjarapu Atchannaidu (Photo : Google)

Kinjarapu Atchannaidu – YS Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు జగన్ అని ఆరోపించారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా స్వయంగా బహిర్గతం చేశారని అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి మాదిగ సామాజిక వర్గ నేతలు భారీగా తరలివచ్చారు.

Also Read..Amit Shah and Prabhas: రాజమౌళి, ప్రభాస్‭తో భేటీకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా?

అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు
” వైసీపీ సర్కార్ దళితులకు తీవ్ర అన్యాయం చేసింది. మాదిగలకు అన్ని విధాలుగా అండగా ఉన్న పార్టీ టీడీపీ. జగన్ లాంటి అవినీతిపరుడు ఈ ప్రపంచంలో లేరని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అవినీతి ఎక్కడా జరగలేదని తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డానే విమర్శించారు. ఈ నాలుగు సంవత్సరాలలో జగన్ దోపిడీ చేసిన విషయాలన్నీ విశాఖపట్నం సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిర్గతం చేశారు. బీజేపీ జాతీయ నేతలు ఆరోపణలు చేసి మూడు రోజులైతే జగన్ ఇంతవరకు నోరు మెదపలేదు. జగన్ రెడ్డికి రూ.510 కోట్ల ఆస్తి ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచారు. దేశంలోనే ధనవంతుడైన సీఎంగా రికార్డ్ సృష్టించిన జగన్ పేదవాడా? ఏడు బంగళాలు కట్టుకున్న జగన్ పేదవాడా?” అని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.

Also Read..Adapa Seshu: కాపులను మోసం చేయడానికే పవన్ వారాహి యాత్ర.. అంతా కలిసి కుట్ర చేస్తున్నారు

వర్ల రామయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
” నేను మాదిగ.. తెలుగుదేశం మాదిగా అని అందరూ చెప్పుకోవాలి. మాదిగ జాతి చాలా కాలంగా దగా పడిన జాతి. రాబోయే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో మాల, మాదిగ వర్గాల మధ్య సమతుల్యం పాటించేందుకు చంద్రబాబు అంగీకరించారు. ఎస్సీ వర్గీకరణకు కొంత జాప్యం జరుగుతుంది. కాబట్టి.. గతంలో చంద్రబాబు జారీ చేసిన జీవో 25 అమలు చేయాలని కోరాం. మాదిగలకు టీడీపీలో ఉన్న గౌరవం మరే ఇతర పార్టీల్లో లేదు”.