ఏపీలో శాసనమండలి అవసరమా ? ఆలోంచాలి – ధర్మాన

దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని అనుకుంటా..మిగతా రాష్ట్రాల్లో మండలి లేదు..ఈ విషయంలో ఆలోచించాలన్నారు వైసీపీ నేత ధర్మాన. ప్రజా బలంతో ఏర్పడిన సభా నిర్ణయాన్ని మండలి అడ్డుకోలేదని, పెద్దల సభ అవసరమే లేదని నాడే ఎన్‌జీ రంగా చెప్పిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు.
ఐదు సంవత్సరాల ప్రజల ఆకాంక్షల నెరవేర్చడానికి ప్రభుత్వ పరుగులను ఆపడానికి జరిగిన కుతంత్రాలపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
నాలుగు నెలల కాలాన్ని తినేయాలన్నదే టీడీపీ లక్ష్యం, చట్టాలను ఆపివేస్తే ఎలా ప్రశ్నించారు. శాసనమండలిలో జరిగిన పరిణామాలతో మళ్లీ ఆలోచన పడేశారన్నారు. ప్రజలు ఎన్నుకున్న తరువాత..ఐదు సంవత్సరాల్లోనే రిజల్ట్ చూపించాలి కదా అన్నారు. ఇలా చేయడం ద్వారా..ప్రజల తీర్పును అవమానం చేసినట్లు కాదా అని నిలదీశారు. ప్రజాస్వామ్యులంతా ఆలోచించాలని పిలుపునిచ్చారు.
శాసనమండలిలో జరిగిన పరిణామాలపై చర్చ జరగాలని, వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలని దీనిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాలన్నారు. కౌన్సిల్ ఎలా వచ్చింది ? కౌన్సిల్ లేకపోతే పరిపాలన సాగదా ? ఉంటే ఎలాంటి ప్రమాదం ఉంది ? అనే దానిపై సుదీర్ఘంగా చర్చ జరగాలన్నారు. దీనికి సభ ప్రత్యేకంగా మరోసారి రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన తీరు..అడ్డగోలుగా వ్యవహరించిన పార్టీ..ఇలా..మూడు బిల్లులను వ్యతిరేకించి..ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనీయరని తెలిపారు.
* శాసనమండలిలో రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు పాస్ కాలేదు.
* ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్ పంపించారు.
* దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
* శాసనమండలి రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
* సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీతో సీఎం జగన్ చర్చలు జరిపారు.
* మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్.
* మండలి రద్దు చేసినా..తమకు ఎలాంటి సమస్య లేదని టీడీపీ అంటోంది.
Read More : జగన్ దమ్మున్న నాయకుడు..మండలి అవసరమా – కన్నబాబు