Tirumala Leopard : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం

తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. చిరుతను చూసిన వాహనదారులు, భక్తులు భయపడిపోతున్నారు.

Tirumala Leopard : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం

Leopard

Updated On : March 26, 2023 / 12:59 PM IST

Tirumala Leopard : తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. గాలి గోపురం సమీపంలోని ఘాట్ రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లో చిరుత పులి కనిపించింది. మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. చిరుతను వాహనదారులు సెల్ ఫోన్ కెమెరాల్లో చిత్రీకరించారు.

మొదటి కనుమ దారిలో 35వ మలుపు వద్ద చిరుత కనిపించడంతో తిరుపతికి వెళ్లున్న వాహనదారులు హడలెత్తిపోయారు. వాహనదారులను చూసి చిరుతపులి చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ఘాట్ రోడ్డులో చిరుతను చూసిన వాహనదారులు, భక్తులు భయపడిపోతున్నారు.

Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో ఇద్దరు యువకులపై చిరుతపులి దాడి

కొంతమంది వాహనదారులు చిరుత సంచరిస్తున్న విషయాన్ని టీటీడీకి సమాచారం ఇచ్చారు. దీంతో టీటీడీ అధికారులు, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చిరుతపులిని తిరిగి అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా చిరుతపులి అనేక సార్లు కనిపించింది. రోడ్డుపై వెళ్తున్న వారిపై డాడి చేసిన సందర్భాలు ఉన్నాయి.