Chittoor : స్కూల్ కు వెళ్లే దారిలో రోడ్డు తవ్వేశారని.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎల్ కేజీ పిల్లాడు
ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారిందని చిన్నారి కార్తికేయ.. పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులందరూ వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తీయించాలని కోరాడు.

Lkg Child
LKG child complained police : చిత్తూరు జిల్లా పలమనేరులో ఆసక్తి ఘటన జరిగింది. ట్రాఫిక్ సమస్యపై ఓ బుడతడు నేరుగా సీఐకి ఫిర్యాదు చేశాడు. స్కూల్ కు వెళ్లే దారిలో రోడ్డు తవ్వేశారని.. ట్రాక్టర్లు, జేసీబీలన్నీ రోడ్డుకు అడంగా వచ్చాయని చిన్నారి కార్తికేయ కంప్లైంట్ చేశాడు. దీంతో ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారిందని కంప్లైంట్ లో పేర్కొన్నాడు.
పోలీసులందరూ వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తీయించాలని కోరాడు. పలమనేరులో ఓ ప్రైవేట్ స్కూల్ లో యూకేజీ స్కూల్ లో ఆరేళ్ల పిల్లాడు కార్తికేయా మాటలకు పోలీసులు ముచ్చటపడ్డారు.
Mahabubabad : కొడుతున్నారంటూ టీచర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండో తరగతి చిన్నోడు
ఏదైనా సమస్య వస్తే తమకు కాల్ చేయాలంటూ నెంబర్ రాసి ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో సీఐతో కార్తికేయ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.