Lookback Politics 2024 : ఏపీ రాజకీయాలను కుదిపేసిన సోషల్ మీడియా పోస్టుల వివాదం..

లిమిట్స్ ని క్రాస్ చేసి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టుల పెట్టిన వారిని వదిలేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Lookback Politics 2024 : ఏపీ రాజకీయాలను కుదిపేసిన సోషల్ మీడియా పోస్టుల వివాదం..

Ap Social Media Posts Controversy (Photo Credit : Google)

Updated On : December 19, 2024 / 4:01 PM IST

Lookback Politics 2024 : మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. 2024కు గుడ్ బై చెప్పబోతున్నాం. న్యూఇయర్ 2025కు వెల్ కమ్ పలకబోతున్నాం. ఈ 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన అంశాలు ఎన్నో. అందులో ఒకటి సోషల్ మీడియా పోస్టుల వివాదం.

సోషల్ మీడియా.. ఏపీ రాజకీయాలను కుదిపేసిందని చెప్పాలి. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారం పలువురి అరెస్టులకు దారి తీసింది. ముఖ్యంగా వైసీపీ కీలక నాయకులు, వారి ప్రధాన అనుచరులు, మద్దతుదారుల మెడకు చుట్టుకుంది. గత ప్రభుత్వంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, షర్మిలను ఉద్దేశించి పెట్టిన పోస్టులు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియా పోస్టుల అంశాన్ని కూటమి సర్కార్ సీరియస్ గా తీసుకుంది. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు.

లిమిట్స్ ని క్రాస్ చేసి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, అభ్యంతరకర, అసభ్యకర పోస్టుల పెట్టిన వారిని వదిలేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించడంతో.. కూటమి సర్కార్ ఈ అంశాన్ని మరింత సీరియస్ గా తీసుకుంది. సోషల్ మీడియాలో హద్దులు మీరిన వారిని గుర్తించి వారి తాట తీసింది. అరెస్టుల పర్వానికి తెరతీసింది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయిన క్షణం నుంచి ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పు కనిపించింది. వాళ్లు వీళ్లు అని కాదు.. హద్దులు దాటి చెత్త రాతలు రాసిన ఎవరినీ పోలీసులు వదలడం లేదు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు కూడా ఈ రచ్చ అంటుకుంది. పోస్టు ఎప్పుడు పెట్టారన్నది కాదు.. తప్పుగా పెట్టారా లేదా అన్నట్లుగా వెతికి పట్టుకుంటున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో హద్దులు దాటిన చాలామంది ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు.

ఏపీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులతో పాటు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ ట్విట్టర్ లో పోస్టు పెట్టారని ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చివరికి ఈ వ్యవహారంలో వర్మ.. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులు, ఆ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ లు ఉన్నారు.

* సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి కేసులో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రా రెడ్డి అరెస్ట్..
* ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేశ్, అనితలపై అనుచిత పోస్టులు
* సోషల్ మీడియా పోస్టుల వివాదంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ
* ఏపీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులతో పాటు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు పెట్టారని వర్మపై కేసులు నమోదు..
* వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సురేశ్ రెడ్డి అరెస్ట్..
* వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డి అరెస్ట్..
* ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలపై అసభ్యకర పోస్టులు
* సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన కేసులో వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మేకా వెంకట రామిరెడ్డి అరెస్ట్

సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టులపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. కూటమి సర్కార్, సీఎం చంద్రబాబుపై జగన్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read : రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన తెలంగాణ తల్లి విగ్రహ వివాదం.. పూర్తి వివరాలు..