Fire Accident : ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు..

Fire Accident : ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం సమీపంలోని బాణసంచా తయారీ ..

Fire Accident : ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు..

fire accident

Updated On : October 8, 2025 / 2:12 PM IST

Fire Accident : ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం మండలం వెదురుపాక సావరం వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. కొందరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసి.. సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ప్రమాదంలో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బాణాసంచా తయారీ కేంద్రంను కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన ఎలుగుబంట్ల సత్తిబాబు నిర్వహిస్తున్నారు. సుమారు 40 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారంలో ఆయన కొనసాగుతున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన బాణాసంచా కేంద్రాల్లో ఇది ఒకటి.

బాణాసంచా తయారీ కేంద్రంలోని అగ్నిప్రమాదం ఘటనలో ఆరుగురు సజీవ దహనం కావడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్యం సాయంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి.. స్వయంగా సంఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆరుగురు చనిపోయినట్లు, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని హోమంత్రి ఆదేశించారు. 2026 వరకు బాణసంచా తయారీ కేంద్రానికి లైసెన్స్‌ ఉందని అధికారులు హోమంత్రికి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అన్నివిధాలా ఆదుకుంటామని హోమంత్రి పేర్కొన్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు హోమంత్రికి అధికారులు తెలిపారు.