మైనర్ బాలికను గర్భవతిని చేసిన కేటుగాడు

మైనర్ బాలికను గర్భవతిని చేసిన కేటుగాడు

Updated On : January 30, 2021 / 12:38 PM IST

man cheats minor girl under pretext of marriage in Vijayawada : మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై మూడేళ్లుగాలైంగిక దాడి చేస్తూ గర్భవతిని చేసిన వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తూరు తాడేపల్లి లంబాడీ తండాలో నివాసం ఉంటున్న బాలిక(14) మీద అదే వీధిలో ఉంటున్న బాణావత్ ప్రసాద్ (20) అనే యువకుడు కన్నేశాడు.

మాయమాటలతో ఆమెకు చేరువై స్నేహితుడిగా మారాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్లుగా ఆమెతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల బాలిక శరీరంలో మార్పులు గమనించిన ఆమె అక్క నిలదీసింది. దీంతో బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్ళి పరీక్షలు చేయించగా, రెండు నెలల గర్భవతిగా వైద్యులు చెప్పారు. బాలికను నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలతో కుటుంబ సభ్యులు ప్రసాద్ పై కేసు నమోదు చేశారు.