RRR Movie : RRR సినిమా చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

ఎస్ వీ మ్యాక్స్ థియేటర్ లో RRR మూవీ బెనిఫిట్ షో చూస్తుండగా అభిమాని ఓబులేసుకు(30) గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం అతన్ని హుటా హుటినా ఆసుపత్రికి తరలించారు.

RRR Movie : RRR సినిమా చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

Man Died

Updated On : March 25, 2022 / 8:29 AM IST

Man dies of heart attack : అనంతపురంలో విషాదం నెలకొంది. థియేటర్లలో RRR సినిమా చూస్తూ గుండె పోటుతో ఓ వ్యక్తి మృతి చెందారు. ఎస్ వీ మ్యాక్స్ థియేటర్ లో RRR మూవీ బెనిఫిట్ షో చూస్తుండగా అభిమాని ఓబులేసుకు(30) గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం అతన్ని హుటా హుటినా ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రికి చేరుకునేలోపే మార్గమధ్యలోనే మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు సందీప్ ధ్రువీకరించారు.

తమ అభిమాన హీరో సినిమా దృశ్యాలను చిత్రీకరిస్తూ కుప్పకూలి పడిపోయినట్లు స్నేహితులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసముద్రంలో మునిగిపోయారు.