Cockfight: కోడి పందాల్లో జాక్‌పాట్.. ఏకంగా కోటిన్నర గెల్చుకున్నాడు
ఇదే ఉత్సాహంతో మరో భారీ పందానికి పందెం రాయుళ్లు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక, కోడి పందేల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు తరలి వచ్చారు.
Cockfight Representative Image (Image Credit To Original Source)
- జోరుగా కోడి పందాలు
- భారీ మొత్తంలో పందాలు
- కోడి పందెంలో కోటిన్నర గెలుచుకున్నాడు
Cockfight: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోడి పందాల్లో ఒక వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. ఏకంగా కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు. సంక్రాంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో కోడి పందాలు జరుగుతున్నాయి. ఇవాళ రెండో రోజు భారీ కోడి పందెం జరిగింది. పైబోయిన వెంకటరామయ్య బరిలో కోటిన్నర పందెం కాశారు.
పందాలు అంటే ఏదో నామ్ కే వాస్తే కాదు.. జాతకం, సమయం, ముహూర్తం ఫిక్స్ చేసుకుని మరీ కోటి 53 లక్షలకు కోడి పందెం వేశారు పందెం రాయుళ్లు. గుడివాడ ప్రభాకర్ సేతువ, రాజమండ్రి రమేశ్ డేగ కోళ్ల మధ్య భారీ పందెం జరిగింది. ఈ పందెంలో రాజమండ్రి రమేశ్ డేగ కోడి గెలిచింది. దీంతో అతడు కోటి రూపాయల 53 లక్షలు గెల్చుకున్నాడు. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే భారీ కోడి పందెం అని స్థానికులు చెబుతున్నారు. ఇక, ఇదే ఉత్సాహంతో రేపు మరో భారీ పందానికి పందెం రాయుళ్లు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక, కోడి పందేల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు తరలి వచ్చారు.
Also Read: కోడి పందాల్లో కళ్లు చెదిరే బహుమతులు.. కార్లు, బైక్‌లు సహా.. బుల్లెట్ బైక్ గెలుచుకున్న ఎమ్మెల్యే
తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగను మూడు రోజుల పాటు ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. సొంతూళ్లకు వెళ్లి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఇక, సంక్రాంతి పండుగ అంటే.. వెంటనే గుర్తుకొచ్చింది కోడి పందాలే. ఎప్పటిలానే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈసారి కూడా ఏపీలో కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు బరిలోకి దిగుతున్నారు. భారీ మొత్తంలో పందేలు కాస్తున్నారు.
రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ కోడి పందేల్లో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. ఇక ఈ కోడి పందాలను చూసేందుకు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు. కొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలోనే కోడి పందాలు జరుగుతున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో ఈసారి కోడి పందాలను వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్ తరహాలో ఏర్పాటు చేశారు. బెట్టింగ్ లు లేకుండా విజేతలకు ఖరీదైన బహుమతులు అందిస్తున్నారు. మూడు రోజులు పందాల్లో చివరి రోజు విజేతలకు బైకులు, కార్లు ఇతర వాహనాలను బహుమతులుగా అందజేస్తున్నారు.
