ఏపీలో కరోనా : 24 గంటల్లో 2,477 కేసులు, 10 మంది మృతి

  • Published By: madhu ,Published On : November 4, 2020 / 05:20 PM IST
ఏపీలో కరోనా : 24 గంటల్లో 2,477 కేసులు, 10 మంది మృతి

Updated On : November 4, 2020 / 5:35 PM IST

Covid 19 Cases In Andhrapradesh : ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా 24 గంటల్లో 75 వేల 465 మంది శాంపిల్స్ పరీక్షించగా…2,477 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 2 వేల 701 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారని, 2020, నవంబర్ 04వ తేదీ బుధవారం వరకు 83 లక్షల 42 వేల 265 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.



ఇక కోవిడ్ వల్ల గుంటూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, విశాఖలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు, చిత్తూరులో ఒక్కరు, తూర్పుగోదావరిలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు మరణించారు.



ఏపీలో 8,33,208కి చేరిన కరోనా కేసులు.
6,744 మంది మృతి.
ఏపీలో 21,438 యాక్టివ్ కేసులు.
8,05,026 మంది డిశ్చార్జ్.



* జిల్లాల వారీగా కేసులు :-
అనంతపురం 52. చిత్తూరు 321. ఈస్ట్ గోదావరి 424. గుంటూరు 323. కడప 127. కృష్ణా 332. కర్నూలు 35. నెల్లూరు 94. ప్రకాశం 70. శ్రీకాకుళం 117. విశాఖపట్టణం 122. విజయనగరం 85. వెస్ట్ గోదావరి 375. మొత్తం కేసులు : 2477.



* రాష్ట్రాల వారీగా శాంపిల్స్ వివరాలు
ఏపీ 83,42,265. కేరళ 47,89,542. తమిళనాడు 1, 016, 9,917. కర్నాటక 81,85,676. తెలంగాణ 43,94,330. గుజరాత్ 62,10,550. మహారాష్ట్ర 91,20,515. రాజస్థాన్ 37,85,407. మధ్యప్రదేశ్ 30,16,456. ఇండియా : 11,29,98,959.