Srikanth Reddy : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు వైద్య సేవలు.. మండల కేంద్రాల్లో ప్రత్యేక వైద్య సిబ్బంది ఏర్పాటు : గడికోట శ్రీకాంత్ రెడ్డి

పవన్ కళ్యాణ్, లోకేష్ గత ప్రభుత్వంలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా గత ఆరు నెలలుగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తెలిపారు. వ్యక్తిగత దూషణలతో అధికారంలోకి వస్తావనే భ్రమలో ఉన్నారని చెప్పారు.

Srikanth Reddy : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు వైద్య సేవలు.. మండల కేంద్రాల్లో ప్రత్యేక వైద్య సిబ్బంది ఏర్పాటు : గడికోట శ్రీకాంత్ రెడ్డి

MLA Gadikota Srikanth Reddy

Srikanth Reddy – Jagananna Arogya Suraksha : రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 45 రోజులపాటు ప్రతి గడపకు వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితి ఆరా తీసి, అవసరమైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం అన్నమయ్య జిల్లాలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. ప్రజలకు ఆరోగ్య సురక్ష ద్వారా వైద్య సేవలు అందించేందుకు ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక వైద్య సిబ్బంది ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన శస్త్ర చికిత్సలు కూడా ఈ కార్యక్రమం ద్వారా చేస్తారని పేర్కొన్నారు.

Anil Kumar : లోకేష్ దొంగలా తప్పించుకుని తిరుగుతుంటే.. సీఐడీ అధికారులు పట్టుకుని నోటీసులిచ్చారు : ఎమ్మెల్యే అనిల్

పవన్ కళ్యాణ్, లోకేష్ గత ప్రభుత్వంలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా గత ఆరు నెలలుగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తెలిపారు. వ్యక్తిగత దూషణలతో అధికారంలోకి వస్తావనే భ్రమలో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేశారని నేడు సానుభూతిని ఆశిస్తున్నారో వారికే తెలియాలన్నారు.