Mekapati ChandraSekhar Reddy: జగన్ ఐదారు సార్లు సీఎం అవుతారనుకుంటే.. ఒక్క ఛాన్స్‌తోనే స్మాష్..: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

చంద్రబాబు తప్పు చేయకపోయినప్పటికీ ఏపీ సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చెప్పారు.

Mekapati ChandraSekhar Reddy: జగన్ ఐదారు సార్లు సీఎం అవుతారనుకుంటే.. ఒక్క ఛాన్స్‌తోనే స్మాష్..: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

Mekapati Chandrasekhar Reddy

Mekapati ChandraSekhar Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) అరెస్టుపై నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే, వైసీపీ (YCP) బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనను జైల్లో పెట్టడం బాధాకరమని, వచ్చే ఎన్నికల తర్వాత రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు.

చంద్రబాబు తప్పు చేయకపోయినప్పటికీ ఏపీ సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై సర్వత్రా సానుభూతి వ్యక్తమవుతోందని తెలిపారు. ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు నాయుడేనని అన్నారు. ఐదారు సార్లు జగన్ సీఎం అవుతారని అకున్నామని, కానీ ఒకే ఒక్క ఛాన్స్‌తోనే ఆయన రాజకీయ జీవితం స్మాష్ అయిపోయిందని చెప్పారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 30 సంవత్సరాలు కష్టపడి ప్రజల కోసం ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన పేరును వాడుకుని స్వార్థం కోసం జగన్ ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. ఈ సారి ఓడిపోతానన్న భయంతోనే చంద్రబాబును అరెస్టు చేయించారని చెప్పారు. అయితే, ఈ అరెస్టు వల్ల వైసీపీ నష్టమే వస్తుందని.. కానీ లాభం ఉండదని అన్నారు. తన అన్న రాజమోహన్ రెడ్డి వల్లే తాను వైసీపీ నుండి సస్పెండ్ అయ్యానని చెప్పారు.

Asaduddin Owaisi : నెహ్రూ, సర్దార్ పటేల్ ముస్లింలపై వివక్ష చూపించారు- మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు