Liquor Rates Decrease : వైన్ షాపుకు పూజలు చేసిన మందు బాబులు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ కొండలో కొంత మంది  మద్యం ప్రియులు ఈరోజు ఉదయం వైన్ షాపుకు దిష్టి తీసి... కొబ్బరికాయలు కొట్టి మద్యం కొనుగోలు చేసారు. 

Liquor Rates Decrease : వైన్ షాపుకు పూజలు చేసిన మందు బాబులు

Prakasam Wine Shop Ki Poojalu

Updated On : December 19, 2021 / 6:56 PM IST

Liquor Rates Decrease :   పక్క రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని అరికట్టటానికి,రాష్ట్రంలో నాటు సారా తయారీని నిరోధించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాట్ ను క్రమబద్ధీకరించింది. ఈ నేపధ్యంలో ఈరోజు నుంచి రాష్ట్రంలో మద్యం రేట్లు తగ్గాయి. మద్యం ధరలు తగ్గించి అన్నీ బ్రాండ్స్ కి అనుమతి ఇచ్చినందుకు మందుబాబులు పండగలా ఫీలయ్యారు. ప్రభుత్వానికి కృతజ్ఞత చెపుతున్నట్లు ప్రకాశం జిల్లా సింగరాయకొండ కొండలో కొంత మంది మద్యం ప్రియులు ఈరోజు ఉదయంవైన్ షాపుకు దిష్టి తీసి… కొబ్బరికాయలు కొట్టి మద్యం కొనుగోలు చేసారు.

రాష్ట్రంలో మద్యం    రేట్లపై ఉన్న    వ్యాట్‌తో   పాటు  స్పెషల్‌ మార్జిన్‌,  అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని ఏపీ ప్రభుత్వం  నిన్న  క్రమబద్ధీకరించింది. ఈ నిర్ణయంతో ఇండియన్‌ మేడ్ ఫారిన్‌ లిక్కర్‌పై ఐదు నుంచి పన్నెండు శాతం.. ఇతర లిక్కర్‌ కేటగిరీలపై ఇరవై శాతం ధర తగ్గే అవకాశం కనిపిస్తోంది.

అంతేకాదు..ఇక నుంచి అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం షాపుల్లో  అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం  పన్నుల్లో  మార్పుల ద్వారా వివిధ కేటగిరీల్లోని మద్యం ధరలు తగ్గే అవకాశం ఉంది.   IMFLలో 400 వరకు కేసు ధర ఉన్న మద్యంపై 50 శాతం మేర వ్యాట్.. 36 శాతం మేర అదనపు ఎక్సైజు డ్యూటీ.. 90 శాతం మేర స్పెషల్ మార్జిన్‌లను క్రమబద్దీకరించింది ప్రభుత్వం.

కేసు 400 నుంచి 1,830 రూపాయల వరకు ఉన్న మద్యం ధరల్లో వ్యాట్, 10 శాతం మేర ఏఈడీ పన్నులు, 110 శాతం మేర స్పెషల్ మార్జిన్ క్రమబద్ధీకరిస్తూ ఏపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. 1 వేయి 830 నుంచి 5 వేల రూపాయల పైగా ధర ఉన్న మద్యంపై 10 శాతం వ్యాట్, 31 శాతం మేర ఏఈడీని తగ్గించింది ప్రభుత్వం. ఈ విభాగాల్లో కేసు ధరను అనుసరించి స్పెషల్ మార్జిన్‌లో తగ్గింపు ఆదేశాలిచ్చింది.
Also Read : YS Sharmila : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన వైఎస్ షర్మిల
ఇక విదేశీ మద్యం అన్ని వెరైటీల్లోని 60 శాతం మేర వ్యాట్.. AAFను 10 శాతం మేర తగ్గించింది. బీర్లకు సంబంధించి 200లోపు కేసు ధర ఉన్న వాటికి.. ఆపై ధర ఉన్న బీర్లకు వ్యాట్‌లో 40 శాతం మేర తగ్గించి.. ప్రత్యేక మార్జిన్‌ను వంద శాతం, 115 శాతం మేర తగ్గిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. బీరు ధరల్లో అదనపు ఎక్సైజు డ్యూటీలో మార్పులు లేవని స్పష్టం చేసింది.