Rain Alert : రెయిన్ అలర్ట్.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వానలు..
Rain Alert : భారత వాతావరణ శాఖ (IMD) వివరాల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది బుధవారం వాయుగుండంగా మారింది. రానున్న 24గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
Rain Alert
Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఉదయం 9గంటల వరకు చలి వణికిస్తుంది. దీంతో ఉదయాన్నే కార్యాలయాలు, ఇతర పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ కీలక విషయాన్ని చెప్పింది.
Also Read : Cm Chandrababu: నీళ్ల విషయంలో రాజకీయాలు సరికాదు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఆనందపడొద్దు- సీఎం చంద్రబాబు
భారత వాతావరణ శాఖ (IMD) వివరాల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది బుధవారం వాయుగుండం (vayugundam) గా మారింది. రానున్న 24గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
ఈ వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాలకు సమీపంగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో.. తమిళనాడు ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఏపీలో పెద్దగా ప్రభావం ఉండకపోయినా.. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలోని ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం లేదని.. శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ తెలంగాణలో పూర్తిగా ఎండ వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రత పగటివేళ 27డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రివేళ 14డిగ్రీల సెల్సియస్‌కి పడిపోతుంది. ఏజెన్సీ, అడవి ప్రాంతాల్లో తీవ్రమైన చలి ఉంటుంది. పొగమంచు ప్రభావం ఉంటుంది.
