Michaung Cyclone : బాపట్ల దగ్గర తీరాన్ని తాకిన మిచాంగ్ తుఫాన్

మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Michaung Cyclone : బాపట్ల దగ్గర తీరాన్ని తాకిన మిచాంగ్ తుఫాన్

michaung cyclone (3)

Updated On : December 5, 2023 / 2:15 PM IST

Michaung Cyclone : బాపట్ల దగ్గర మిచాంగ్ తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాన్ మరో గంటలో పూర్తిగా తీరాన్ని దాటనుంది. బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. తుఫాన్ సాయంత్రానికి వాయుగుండగా బలహీన పడే అవకాశం ఉంది. ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప.గో, ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, కడప, తూ.గో, కాకినాడ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి. తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Michaung Cyclone : మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. దుర్గగుడి ఘాట్ రోడ్ మూసివేత, సహాయకచర్యలకు ఒక్కో జిల్లాకు రూ.10 కోట్లు ఇవ్వాలన్న రామకృష్ణ

బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.  వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.  తీరం వెంబడి గంటకు 90-110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మీచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల విజయవాడలో భారీగా వర్షం కురుస్తోంది.

భారీ వర్షానికి కొండ చర్యలు ఇరిగిపడతాయని దుర్గగుడి అధికారులు ముందుగానే ఘాట్ రోడ్డు ముసి వేశారు. దుర్గగుడికి కార్లకు, ద్విచక్ర వాహనాలు పై వచ్చే భక్తులకు అనుమతి లేదని దుర్గగుడి అధికారులు తెలిపారు. దుర్గ గుడికి వచ్చే భక్తులు మెట్ల మార్గం, లిఫ్ట్ మార్గం ద్వారా దుర్గగుడికి రావాలని ఆలయ అధికారులు సూచించారు.

Michaung Cyclone : తెలంగాణపై మిచాంగ్ తుఫాన్ ప్రభావం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు… స్కూల్స్, అంగన్ వాడీ కేంద్రాలకు సెలవు

తిరుపతిపై మీచాంగ్ తుఫాన్ విరుచుకుపడింది. గతరాత్రి ఎడతెరపి లేని వర్షం కురిసింది. రాత్రంతా తిరుపతి అంధకారంలోనే మగ్గింది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల పాత ఇంటి గోడలు కూలిపోయాయి.

పలు చోట్ల వాహనాలు ధ్వంసం అయ్యాయి. కపిలతీర్థం జలపాతం పొంగిపొర్లుతోంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కమీషనర్ హరిత, ఉప మేయర్ అభినయ్ రెడ్డి సందర్శిస్తున్నారు.