Alla Nani GGH : నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపులపై ప్రభుత్వం సీరియస్

నెల్లూరు GGHలో ఉన్నతాధికారి లైంగిక వేధింపుల పర్వంపై డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు.

Alla Nani GGH : నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపులపై ప్రభుత్వం సీరియస్

Alla Nani Ggh

Updated On : June 4, 2021 / 3:40 PM IST

Alla Nani GGH : నెల్లూరు GGHలో ఉన్నతాధికారి లైంగిక వేధింపుల పర్వంపై డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. దీనిపై ఆయన స్పందించారు. ఈ వ్యవహారంపై వాస్తవాలు తెలుసుకునేందుకు సీనియర్ వైద్యులతో త్రిసభ్య కమిటీ వేశారు. నెల్లూరు ACSR మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సాంబశివరావు, ఇద్దరు ప్రొఫెసర్స్ తో విచారణకు అదేశించారు.

సాయంత్రానికి పూర్తి నివేదిక ఇవ్వాలని DME డాక్టర్ రాఘవేంద్ర రావును మంత్రి అదేశించారు. విచారణలో లైంగిక వేధింపులు నిజమే అని తేలితే కఠినంగా చర్యలు ఉంటాయని మంత్రి చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

జీజీహెచ్ ఘటనపై రెండు కమిటీలు విచారణ చేపడుతున్నాయని ఇంచార్జి కలెక్టర్ ప్రసాద్ తెలిపారు. అందులో ఒకటి DME తరపున Acsr మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సాంబశివరావు నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ కాగా, మరొకటి జిల్లా తరపున ఇండిపెండెంట్ కమిటీ అని చెప్పారు. జిల్లా కమిటీలో జెడ్పీ సీఈవో, ఐసీడీఎస్ పీడీ, జాయింట్ కలెక్టర్ (ఆసరా) త్రిసభ్యులు ఉంటారు. DME తరపు కమిటీ ఇంటర్నల్ గా ఎంక్వయిరీ చేస్తే.. డిస్ట్రిక్ట్ కమిటీ బయట నుంచి ఎంక్వైరీ చేస్తుందన్నారు.

ఇప్పటివరకు ఈ ఘటనపై ఎలాంటి కంప్లైంట్ లేదన్నారు. ఇది సీరియస్ ఇష్యూ కాబట్టి DME కమిటీ కానీ.. డిస్ట్రిక్ట్ కమిటీ కానీ దీన్ని సుమోటోగా తీసుకుంటుందన్నారు. 24 గంటల్లో డిస్ట్రిక్ట్ కమిటీ ప్రిలిమనరీ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుందన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఇంచార్జి కలెక్టర్ ప్రసాద్ తేల్చి చెప్పారు.