Minister Ambati Rambabu : నాపై జరిగిన దాడి చిన్నది కాదు .. దీని వెనుక కుట్ర ఉంది : మంత్రి అంబటి రాంబాబు
తనపై దాడికి యత్నించిన వారిలో తొమ్మిదిమందిని గుర్తించాం..వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు అని అంబటి రాంబాబు తెలిపారు. వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని..కమ్మ వారిలో ఉగ్రవాదులు తయారయ్యారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ambati Rambabu..Pawan kalyan
Minister Ambati Rambabu..Pawan kalyan : తనపై జరిగిన దాడి యత్నం చిన్నదిగా చూడొద్దు..దీని వెనుక కుట్ర ఉంది అంటూ ఖమ్మం జిల్లాలో కారు ప్రమాద ఘటనపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను భౌతికంగా తొలగించాలని గతంలో ఓ సమావేశంలో కొంతమంది వ్యాఖ్యానించారని..సత్తుపల్లిలో జరిగిన ఘటనకు దీనికి సంబంధముందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. తనపై దాడికి యత్నించిన వారిలో తొమ్మిదిమందిని గుర్తించామని.. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారని…వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అని తెలిపారు.
కమ్మ వారిలో ఉగ్రవాదులు తయారయ్యారని వారంతా టీడీపీని నాశనం చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ బలంగా ఉందని చెబుతున్నారు మరి అంత బలంగా ఉంటే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా..? అంటూ ప్రశ్నించారు. తనపై దాడి జరిగిన తరువాత తనను పరామర్శించినవారికి తన ధన్యవాదాలు తెలిపారు అంబటి.ఈ సందర్భంగా అసెంబ్లీలో తాను భువనేశ్వరి గురించి తాను తప్పుగా మాట్లాడలేదు అంటూ వివరణ ఇస్తు..ఆమె గురించి మాట్లాడింది ఆ సామాజిక వర్గం నేతే అన్నారు. భౌతిక దాడులకు పాల్పడిన ఏ పార్టీ కాని సామాజిక వర్గం కానీ బ్రతికి బట్ట కట్టలేదన్నారు.
అంబటి రాంబాబుపై జరిగిన దాడి ఒక సామాజిక వర్గంపై జరిగినట్లుగా భావిస్తున్నాం : మంత్రి గుడివాడ అమర్నాథ్
ఈ సందర్బంగా అంబటి మరోసారి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తు..పవన్ కళ్యాణ్ ఓ కిరాయి కోటి గాడు అంటూ అభివర్ణించారు. ఆయన కిరాయి తీసుకుంటాడు కాబట్టే తనపై జరిగిన దాడిని ఖండించడు.. అంటూ వ్యాఖ్యానించారు.ప్రగల్భాలు పలికే పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఏదైనా అంటే మాత్రం రోడ్డు మీద పడుకుంటాడు అంటూ ఎద్దేవా చేశారు.ముద్రగడ మీద దాడి చేసినప్పుడు ఖండించాడా.. ? అంటూ ప్రశ్నించారు అంబటి రాంబాబు.