Ambati Rambabu : జగన్ పోవాలంటున్న పవన్ ఎవరో రావాలో కూడా చెప్పండీ : అంబటి రాంబాబు

ఎన్నికల వరకు హలో అంటారు తరువాత చలో హైదరాబాద్ అంటారు. జ్వరం వచ్చిందని చెప్పి యాత్ర ఆపేశారు. కానీ ఆయన కార్యాలయంలో సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నారు.

Ambati Rambabu : జగన్ పోవాలంటున్న పవన్ ఎవరో రావాలో కూడా చెప్పండీ : అంబటి రాంబాబు

Ambati Rambabu

Updated On : June 29, 2023 / 4:39 PM IST

Minister  Ambati Rambabu : వారాహి యాత్ర(,Varahi yatra)లో జనసేన అధినేత  పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan)వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పైనా సీఎం జగన్ (CM Jagan) పైన వినూత్న రీతిలో విరుచుకుపడుతున్నారు. ఒక్కోరోజు యాత్రలో ఒక్కో పంచ్ డైలాగులతో పాటు వినూత్న రీతిలో స్లోగన్స్ తో ఆకట్టుకుంటున్నారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలి, హలో ఏపీ..బైబై జగన్, బైబై వైసీపీ అంటు తన ప్రసంగాల్లో చెణుకులు విసురుతున్నారు. ఇలా పవన్ చేసే వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో పవన్ పై సెటైర్లు వేశారు.

జగన్ పోవాలని పవన్ అంటున్నారు..మరి ఎవరు రావాలో మాత్రం చెప్పటంలేదంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల వరకు హలో అంటారు తరువాత చలో హైదరాబాద్ అంటారు అంటూ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం పోతే పథకాలన్ని పోతాయని అన్నారు రాంబాబు. జ్వరం వచ్చిందని చెప్పి యాత్ర ఆపేశారు. కానీ ఆయన కార్యాలయంలో మాత్రం తన సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నారు పవన్. తన సినిమాలను తను డబ్బింగ్ చెప్పుకోవటంలో తప్పు అని నేను చెప్పటంలేదు.కానీ పవన్ మాత్రం రాజకీయాల్లో చంద్రబాబుకు డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి దిగజారిపోయారు అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ మాటలన్నీ విషపూరితమైనవేనని విమర్శించారు.

ఇలా రాష్ట్రంలో రాజకీయాలు చూస్తుంటే చాలా బాధేస్తోందన్నారు. మరోవైపు మరోకాయన అంటూ లోకేశ్ యువగళంపై సెటైర్లు వేశారు. యువగళం అంటూ పాదయాత్ర చేస్తున్నారు. కానీ అయనకు అసలు గళమే లేదంటూ ఎద్దేవా చేశారు.