అంబటి రాయుడు జనసేనలో ఎన్ని రోజులు ఉంటారో చూద్దాం, నా భవిష్యత్ జగన్ నిర్ణయిస్తారు- మంత్రి గుడివాడ అమర్నాథ్

సీఎం జగన్ కు అమర్నాథ్ అంటే ఏంటో తెలుసు. నాకు ఏం చేయా ఆయనకి తెలుసు. నేను పార్టీకి ఎలాంటి సేవ చెయ్యాలో ఆయనకి తెలుసు

అంబటి రాయుడు జనసేనలో ఎన్ని రోజులు ఉంటారో చూద్దాం, నా భవిష్యత్ జగన్ నిర్ణయిస్తారు- మంత్రి గుడివాడ అమర్నాథ్

Minister Gudivada Amarnath Slams Ambati Rayudu

Updated On : January 10, 2024 / 7:48 PM IST

 

Gudivada Amarnath : ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలవడం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ తో రాయుడు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. అంబటి రాయుడు మా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఎవరిని కలిస్తే మాకేంటి..? అని మంత్రి అమర్నాథ్ అన్నారు. నేను రావడం వల్లే పార్టీకి ఇమేజ్ పెరిగింది అనుకుంటే వారికి పతనం మొదలు అయినట్టే అని వ్యాఖ్యానించారు. పార్టీ తర్వాతే ఎవరైనా. రాయుడు జనసేనలో ఏం చేస్తారో? అక్కడ ఎన్ని రోజులు ఉంటారో చూద్దాం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

అంబటి రాయుడు కొన్నిరోజుల కిందటే వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇలా పార్టీలో చేరి 10 రోజులు గడవకముందే వైసీపీకి రాయుడు రాజీనామా చేయడం ఓ సంచలనం. ఇప్పుడు అంతకుమించి మరో సంచలనం జరిగింది. అంబటి రాయుడు ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Also Read : సంపదంతా వాళ్ల చేతుల్లోకే వెళ్తుంది..! ప్రస్తుత రాజకీయాలపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

మంత్రి గుడివాడ అమర్నాథ్ సీఎం జగన్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెలలో కర్నూలులో 2వేల 500 కోట్లతో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ శంకుస్థాపనపై సీఎం జగన్ తో చర్చించినట్లు తెలిపారు. కాగా, వైసీపీలో మార్పులపై రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదన్నారు. నా భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు, నాకు ఎలాంటి గాబరా లేదు అని మంత్రి అమర్నాథ్ అన్నారు. నాకు పెందుర్తి, చోడవరం టికెట్ కేటాయిస్తారు అని చెబుతున్నారు. అవన్నీ ప్రచారాలు మాత్రమే. సీఎం జగన్ కు అమర్నాథ్ అంటే ఏంటో తెలుసు. నాకు ఏం చేయా ఆయనకి తెలుసు. నేను పార్టీకి ఎలాంటి సేవ చెయ్యాలో ఆయనకి తెలుసు” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే సీఎం జగన్ అక్కడ కొత్త వ్యక్తిని నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించారు. అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతలు మలసాల భరత్ కుమార్ కు అప్పగించారు. అనకాపల్లికి కొత్త అభ్యర్థిని ప్రకటించిన జగన్.. మంత్రి గుడివాడ అమర్నాథ్ అభ్యర్థిత్వాన్ని మాత్రం పెండింగ్ లో ఉంచారు. ఈసారి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది క్లారిటీ లేదు.

Also Read : గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్