Kinjarapu Atchannaidu: జగన్ పర్యటనలో కుట్రలు బయటపడ్డాయి, అంతా పథకం ప్రకారమే, ఒక డీఎస్పీని రప్పా రప్పా అంటారా?- మంత్రి అచ్చెన్నాయుడు
క్రిమినల్ ఆలోచనలతో ఇలాంటి పర్యటనలు చేస్తున్నారు. మేము అప్రమత్తంగా లేకపోతే పెద్ద ప్రమాదం సంభవించేది.

Kinjarapu Atchannaidu: వైసీపీ అధినేత జగన్ బంగారు పాళ్యం పర్యటన వెనుక వైసీపీ కుట్రలు బయటపడ్డాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తమ పార్టీ నేతలతో రోడ్డుపై మామిడి కాయలు పారబోయించారని ఆయన ఆరోపించారు. ముందుస్తు వ్యూహంలో భాగంగా వైసీపీ కార్యకర్తలు 5 ట్రాక్టర్లను సిద్ధం చేసుకున్నారని చెప్పారు. జగన్ అక్కడికి రాగానే మామిడి కాయల పంటను రోడ్డుపై పారబోశారని మంత్రి అచ్చెన్న చెప్పారు.
మామిడి కాయలు తెచ్చిన 5 ట్రాక్టర్లను ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకున్నట్లు నిర్ధారించామన్నారు. AP03-AA-0218, AP20-U-9212, AP03-M-018, AP03-S-8542, AP03- TB-5532 నెంబర్ ప్లేట్లు కలిగున్న ట్రాక్టర్లలో వైసీపీ చెందిన వారి ద్వారా కాయల తరలించి రోడ్డుపై పారబోశారని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మామిడికాయలు ఎవరి దగ్గరి నుంచి వచ్చాయి? ఎవరు తెచ్చారు? అనే వివరాలు తెలుసుకున్నామన్నారు.
క్యాబినెట్ లో మామిడికి రూ.260 కోట్లు కేటాయించాం. రేపటి నుండి 4 రూపాయలు అమ్మిన రైతులు ఖాతాల్లో డబ్బులు పడతాయి. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్న వెంటనే తెలుసుకుని ఇంత తొందరగా స్పందించిన ఉదంతాలు లేవు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లలో ఏ సమస్యలు వస్తాయో ముందుగా తెలుసుకొని చర్యలు తీసుకున్నాం.
చిత్తూరు జిల్లాలో మామిడి పంట ధరలు తగ్గి ఇబ్బంది పడ్డారు. తోతాపురి మామిడి ఈ మూడు జిల్లాల్లో 2.5 లక్షల క్రాప్ వచ్చేది. ఈసారి 7 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. ఈ మామిడిని పల్ప్ కోసం కొంటారు. ఇప్పటికే ఇండస్ట్రీ వారి వద్ద పల్ప్ ఉండడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీనికి సంబంధించి 2 నెలల ముందు తోతాపురి మామిడిపై నిర్ణయం తీసుకున్నాం. రైతులు, కంపెనీలు వద్దకు వెళ్లాను. మార్కెట్ కు వెళ్లాను. చివరకు కేజీ ధర 12 రూపాయలుగా నిర్ధారించాం. అంతే ధరకు కొనాలని పరిశ్రమలకు చెప్పాం. చివరికి 8 రూపాయలకు కొనాలని చెప్పాం. ఇందులో 4 రూపాయలు ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పాం. ఇలా 50, 60 రోజులుగా కొనుగోలు చేస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో 95శాతం, తిరుపతిలో 98శాతం, చిత్తూరులో 85శాతం కొనుగోలు జరిగిపోయింది.
Also Read: వైసీపీపై సీఎం చంద్రబాబు సీరియస్, కుట్రలపై విచారణ జరిపిస్తామని ప్రకటన..
పెళ్లి అయ్యాక ఆరు మాసాల తర్వాల మేళాలు వాయించినట్టు.. లేని సమస్యను సృష్టించి ఓ నాయకుడు బయలుదేరాడు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్లాన్డ్ గా యాత్రలు చేస్తున్నారు. పరామర్శకు వెళితే చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంకు వెళ్లి వ్యవహారం నడిపించాలి. అయితే ప్రోగ్రాంకు వాహనాలు, డబ్బు, ఐదారు జిల్లాల నుండి జనాలను తరలించడం.. ఇవన్నీ కావాలని చేశారు. ఒక నాయకుడు ర్యాలీగా వెళితే ఇబ్బందులు వస్తాయి. హెలిప్యాడ్ కు పర్మిషన్ అడుగుతారు. స్పాట్ కు 100 మీటర్లు దూరంలో హెలిప్యాడ్ కు ఒప్పుకోరు. 6 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ కావాలంటారు. ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక క్రిమినల్ ఆలోచనలతో ఇలాంటి పర్యటనలు చేస్తున్నారు.
ప్రకాశ్ రెడ్డి చిత్తూరు జిల్లా వైసీపీ నేత. 12 రూపాయలకు మామిడి పండ్లు అమ్మారు. 4, 5 ట్రాక్టర్లు తోటలో పెట్టుకుని మిగతావి రోడ్డుపై పోశారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్.. వాటిని దిగి చూడాలి. కానీ, తొక్కించేశావు. పైగా ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? క్రిమినల్ రాజకీయ ముసుగులో ప్లాన్ ప్రకారం ఎలా వ్యవహరిస్తారో చూశాం. మేము అప్రమత్తంగా లేకపోతే పెద్ద ప్రమాదం సంభవించేది.
రాష్ట్ర ప్రభుత్వం కేజీకి 4 రూపాయలు ఇస్తుంది. దీనికి 260 కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నాం. కర్నాటక లాంటి జీవో ఇస్తే ప్రభుత్వానికి 130 కోట్లు కలిసి వస్తుంది. చిత్తూరు జిల్లా పలమనేరు ఎక్స్ ఎమ్మెల్యే వెంకటేశ్ గౌడ్ ఒక డీఎస్పీని రప్పా రప్పా కోసెయ్యండని అంటే లా అండ్ ఆర్డర్ ను ఎవరు కాపాడతారు? పర్మిషన్ ఇచ్చాము. దాన్ని వారు వయలేట్ చేశారు. టోటల్ గా రికార్డ్ చేశాం. బాడీ కెమెరాలు పెట్టాము. ఇంకా మైన్యూట్ కు వెళతాం. ఒక మాజీ ఎమ్మెల్యే రపా రపా అంటారా?” అంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.