Payyavula Keshav : రాహుల్ గాంధీలా జగన్ మరో 15 సంవత్సరాలు కలలు కంటూ ఉంటారు- మంత్రి పయ్యావుల కేశవ్

అసెంబ్లీని ఫేస్ చేసే ధైర్యం లేకనే మీరిలా మాట్లాడుతున్నారని మీ మాటల ద్వారా అర్థమవుతుందన్నారు పయ్యావుల కేశవ్.

Payyavula Keshav : రాహుల్ గాంధీలా జగన్ మరో 15 సంవత్సరాలు కలలు కంటూ ఉంటారు- మంత్రి పయ్యావుల కేశవ్

Updated On : February 6, 2025 / 6:00 PM IST

Payyavula Keshav : ఈసారి జగన్ 2.O ని చూడబోతున్నారు, 2.O వేరేగా ఉంటుంది అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు కూటమి పార్టీల నాయకులు. జగన్ పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. జగన్ కలలు కనడంలో ఇబ్బంది లేదన్నారు. కలలను నిజాలు అనుకోవడంలోనే ఇబ్బందంతా అన్నారు.

వైసీపీ కేడర్ లో నమ్మకాన్ని నింపేందుకు జగన్ ప్రయాస..
రాహుల్ గాంధీ లాగా మరో 15 సంవత్సరాలు కలలు కంటూ జగన్ ఉంటారని విమర్శించారు. జగన్ ఆ మాత్రం కలలు కనకపోతే ఆయనకు, కేడర్ కు నిద్ర పట్టదన్నారు. మనసును సర్ది చెప్పుకోవడానికి, ఆయన కేడర్ లో నమ్మకాన్ని నింపడానికి జగన్ ఈ ప్రయాస పడుతున్నారని మంత్రి పయ్యావుల కామెంట్ చేశారు.

Also Read : నాడు వైసీపీ.. నేడు కూటమి.. మున్సిపాలిటీల్లో పవర్ గేమ్..!

జగన్ కలలు కల్లలుగానే మిగిలి పోతాయి..
జగన్ కలలు కల్లలుగానే మిగిలి పోతాయన్నారు. ప్రతిపక్ష హోదాపై గత శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో మీరు ఏం చెప్పారో ఒకసారి మీరే వినండని జగన్ కు సూచించారు పయ్యావుల కేశవ్. అసెంబ్లీని ఫేస్ చేసే ధైర్యం లేకనే మీరిలా మాట్లాడుతున్నారని మీ మాటల ద్వారా అర్థమవుతుందన్నారు పయ్యావుల కేశవ్.

కూటమి అభివృద్ధితో జగన్ కు గుండు కొట్టడం ఖాయం..
వైఎస్ జగన్ 2.O వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రతిపక్ష హోదా కోల్పోయిన వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు. కూటమి అభివృద్ధితో జగన్ కు గుండు కొట్టడం ఖాయమన్నారాయన. సొంత తమ్ముడు ముద్దాయి అని తెలిసినా జగన్ బయటకు చెప్పలేదని ధ్వజమెత్తారు.

రాబోయే 30 ఏళ్లు రాజకీయాల్లో మేమే ఉంటాం..
కర్నూలులో అవినాశ్ అరెస్ట్ ను అప్పటి పోలీసులను అడ్డు పెట్టుకుని జగన్ ఆపారని ఆరోపించారు. మూడు పార్టీలు ఏకం అయ్యాము, జగన్ ను ఏకాకి చేస్తాము అని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా ఆదినారాయణ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పీఠం బీజేపీ కైవసం కాబోతోందని జోస్యం చెప్పారు. రాబోయే 30 ఏళ్లు రాజకీయాల్లో మేమే ఉంటామన్నారు.

Also Read : ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛ‌న్‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..

జగన్ 2.O చూడబోతున్నారు..
”ఈసారి జగన్ 2.Oని చూడబోతున్నారు, 2.O వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయపడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలి పెట్టను. ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా” అంటూ కార్యకర్తలతో జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.