AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కింద వైద్య సేవలను..

Chandrababu Naidu
AP Government: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కింద వైద్య సేవలను తెలంగాణలో విస్తృతం చేసింది. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆ రాష్ట్రంలో గుర్తింపునిచ్చిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు.. వారి కుటుంబాలకు చికిత్స పొందే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Also Read: AP Govt : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు..!
ఇటీవలి కాలంలో తెలంగాణలో వైద్యం చేయించుకున్న పలువురు ఏపీ ఉద్యోగులు, పింఛనర్లు బిల్లులు రీయింబర్స్ కాకపోవటంతో నష్టపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత అనేక మంది ఏపీ ఉద్యోగులు హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర విభజనకు చెందిన 9, 10వ షెడ్యూలు జాబితాల్లో ఉన్న సంస్థల ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది. ఇకనుంచి వారు తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునేందుకు ఆమోదం లభించింది.
Also Read: YSRCP vs TDP : నాడు వైసీపీ.. నేడు కూటమి.. మున్సిపాలిటీల్లో పవర్ గేమ్..!
2015లో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. కేవలం 11 ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే ఈహెచ్ఎస్ కార్డు ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుర్తింపులేని ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందితే వైద్య బిల్లుల రీయింబర్స్ మెంట్ కు ట్రెజరీ అధికారులు తిరస్కరిస్తున్నారు. దీంతో ఈహెచ్ఎస్ కింద వైద్య సేవలను తెలంగాణలోనూ విస్తరించాలని కోరుతూ పలుసార్లు ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం పున: పరిశీలన జరిపి.. తెలంగాణలోని డీఎంఈ అధికారులు గుర్తింపునిచ్చిన అన్ని ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు వీలు కల్పిస్తూ బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు.