Peddi Reddy : చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఎవరొచ్చినా.. గెలుపు మాదే
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ తరుఫున మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి అంతా తామై వ్యవహరిస్తున్నారు. 30 ఏళ్లుగా కుప్పంకు..

Peddi Reddy
Peddi Reddy : చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ తరుఫున మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి అంతా తామై వ్యవహరిస్తున్నారు. 30 ఏళ్లుగా కుప్పంకు చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. కుప్పంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందన్నారు.
చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఎవరొచ్చినా వైసీపీ గెలుపు ఆపలేరని అన్నారు. కుప్పంలో 25 వార్డులు మేమే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలో బయటి నుంచి టీడీపీ నేతలు ఎంత మంది వచ్చినా మాకు నష్టం లేదన్నారు.
WhatsApp: మీ వాట్సాప్‌లో చాట్ డిలీట్ అయిందా? ఇలా రికవరీ చేసుకోవచ్చు!
కుప్పం ఇకపై మాది అని చెప్పారు. చంద్రబాబు ఇక ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. అతి త్వరలోనే కుప్పంకు హంద్రీ-నీవా జలాలు రానున్నాయని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. కుప్పం వాసులకు కావాల్సిన వాటన్నింటినీ అందిస్తామన్నారు. ఈ ఎన్నికతో చంద్రబాబుకి కనువిప్పు కలుగుతుందన్నారు.