Andhra Pradesh: మరో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం జగన్ యోచిస్తున్నారు : మంత్రి పేర్ని నాని
ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం జగన్ యోచిస్తున్నారు అని మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

Minister Perni Nani (1)
Minister Perni Nani: ఆంధ్రప్రదేశ్ లో కొత్త 13 జిల్లాలు ఏర్పాడ్డాయనే విషయం తెలిసిందే. సీఎం జగన్ ఈ కొత్త జిల్లాలను ప్రారంభించారు కూడా. పాలన కూడా ప్రారంభమైంది. ఈక్రమంలో మంత్రి పేర్ని నాని ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం జగన్ ఆలోచిస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతన సంతరించుకున్నాయి. కొత్తగా ఏర్పాటు అయిన 13 జిల్లాలను మొత్తం 26 జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల నుంచి పాలన కూడా ప్రారంభమైంది.
ఈ క్రమంలో ఏపీలో మరో జిల్లా రూపుదిద్దుకోనుందని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలతో ఏంటా కొత్త జిల్లా? దాని పేరు ఏమిటి? ఏఏ జిల్లాల నుంచి విడదీస్తారు? దీంతో ఏఏ గ్రామాలు కలిసి కొత్త జిల్లాగా ఏర్పడుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కలెక్టర్లు, ఎస్పీలను సైతం నియమించింది. ఈ క్రమంలో మంత్రి పెర్ని నాని 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందంటూ మంత్రి పేర్ని నాని మంగళవారం (ఏప్రిల్ 5,2022)పేర్కొన్నారు. గిరిజన (Tribal Areas) ప్రాంతాలన్నీ కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని నాని వెల్లడించారు.
ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాలు ఏర్పాటు చేశామని.. మరో జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. పాలనను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.పోలవరం, రంపచోడవరం రెండు నియజవర్గాలను కలిపి 27 వ జిల్లాగా ఏర్పడనున్నట్లుగా తెలుస్తోంది. పోలవరం జిల్లా కేంద్రంగా కొత్త జిల్లాగా ఏర్పడనుంది.పోలవరం ప్రాజెక్టుకి దగ్గరలో రెండు నియోజకవర్గాలను కలిపి బ్రిడ్జ్ నిర్మాణం చేసే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.