Perni Nani Counter To Pawan : చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ కళ్యాణ్ తహతహలాడుతున్నారు-పేర్ని నాని
కమ్మవారిని వైసీపీకి దూరం చేయాలని ఎందుకు చూస్తున్నారు? ఎక్కడ నేర్చుకున్నావు ఈ ఊసరవెల్లి రాజకీయం? కర్నూలులో ఇదే మన రాజధాని అనలేదా?(Perni Nani Counter To Pawan)

Perni Nani Counter To Pawan
Perni Nani Counter To Pawan : వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ ను ఉద్దేశించి జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ పై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు. పవన్ ను మానసిక అత్యాచారం చేసే వ్యక్తిగా అభివర్ణించారు మంత్రి పేర్నినాని. బజారునపడి తిట్టుకున్న టీడీపీ, బీజేపీ నాయకులను కలిపేయత్నం పవన్ చేశారని మంత్రి అన్నారు. అందరికీ నమస్కారం చేసిన పవన్ కు.. జీవితాన్ని ఇచ్చిన చిరంజీవి కనపడలేదా? అని నిలదీశారు. చిరంజీవి లేకుంటే పవన్ ఎదగేవాడా? అని అడిగారు.(Perni Nani Counter To Pawan)
”యువరాజ్యం అధ్యక్షుడిగా ఊరు-వాడ తిరిగిన పవన్.. అప్పటి నుండి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. లైసెన్స్ డ్ కిల్లర్ లాగా ఆడమగ తేడా లేకుండా మానసిక అత్యాచారం చేసే వ్యక్తి పవన్ అని మంత్రి పేర్నినాని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్.. ఇంతవరకు ప్రజలకు ఉపయోగపడే ఏం చేశారో చెప్పాలన్నారు. ఉద్దానంకు వెళ్లి ఏం చేశారు? చంద్రబాబు, పవన్ ఉద్దానాన్ని ఏం ఉద్దరించారు? కులంలో పెద్ద హీరోవి అని పిల్ల పెళ్లికి పిలిస్తే ర్యాంబో రాంబాబు అంటావా?(Perni Nani Counter To Pawan)
Pawan Kalyan: జగన్ పాలనలో జరిగింది.. జరిగేది ఇదే..! జనసేన ఆవిర్భావ సభలో విరుచుకుపడిన పవన్
విజయవాడలో ఐవైఆర్ కృష్ణారావు పుస్తకావిష్కరణలో ఇది కుల రాజధాని అనలేదా? కర్నూలులో ఇదే మన రాజధాని అనలేదా? ఒక్కపైసా లంచం లేకుండా ప్రజల ఖాతాల్లో డబ్బు చేయడం తెలియదా? నాడూ-నేడులో పాఠశాలల అభివృద్ది తెలియలేదా? నాడు-నేడు కార్యక్రమంలో హాస్పిటల్స్ అభివృద్ది కనబడలేదా? ప్రత్యేక హోదాపై బీజేపీ పార్లమెంటులో చెప్పిన మాట అడగరా? విశాఖ ఉక్కును అమ్మవద్దని బీజేపీని అడగరా? ఎక్కడ నేర్చుకున్నావు ఈ ఊసరవెల్లి రాజకీయం” అని పవన్ పై ఫైర్ అయ్యారు మంత్రి పేర్నినాని.
సినిమా డైలాగులు వేరు, రాజకీయాలు వేరు పవన్. కంఠం పవన్ ది, భావం చంద్రబాబుది. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, రామాయపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వని బీజేపీని ఎందుకు ప్రశ్నించలేదు. కమ్మవాళ్లు వేలాది మంది వైసీపీ కార్యకర్తలుగా ఉన్నారు. కమ్మవారిని వైసీపీకి దూరం చేయాలని ఎందుకు చూస్తున్నావ్? చంద్రబాబు కోసం అన్ని పార్టీలను కలుపుతానని పవన్ అంటున్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ తహతహలాడుతున్నారు.(Perni Nani Counter To Pawan)
జనసేన కార్యకర్తలకు ఒక్కోసారి ఒక్కో గుర్తుకు ఓటు వేయమని పవన్ చెబుతున్నారు. జనసేన కార్యకర్తలకు దిక్కు తెలియడం లేదు. నికార్సైన, నిజాయితీపరుడైన తమిళనాడుకు చెందిన దళిత జడ్జిని చంద్రబాబు, టీడీపీ నాయకులు తిడితే పవన్ ఎందుకు మాట్లాడలేదు. చంద్రబాబు అప్పు చేస్తే తప్ప కాదు… జగన్ అప్పు చేస్తే తప్పు అంటారా?
Nagababu : జగన్ మళ్లీ సీఎం అయితే ఏపీ ప్రజలు కాందిశీకుల్లా పక్క రాష్ట్రాలకు వెళ్లాలి : నాగబాబు
హిందుత్వం గురించి మాట్లాడే పవన్.. టీడీపీ, బీజేపీ పాలనలో కూల్చిన గుళ్లపై ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు హిందూ దేవాదాయ చట్టాన్ని ఎందుకు మార్చలేదు? అప్పుడు బీజేపీ వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ చేతిలో టీడీపీ, కమ్యూనిస్టులను కూడా పెడుతున్నారు. జనసేన, బీజేపీ నాయకులు తెలుసుకోవాలి. చంద్రబాబు కోసం పని చేయాలని పవన్ చెబుతున్నాడు” అని మంత్రి పేర్నినాని అన్నారు.