టూరిజం ప్రాజెక్టులో భాగంగా రుషికొండ భవనాలు ప్రారంభం: మంత్రి గుడివాడ

విశాఖపట్నంలో రుషికొండ ప్రాంతంలో నిర్మించిన భవనాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభోత్పవం చేసింది.

టూరిజం ప్రాజెక్టులో భాగంగా రుషికొండ భవనాలు ప్రారంభం: మంత్రి గుడివాడ

minister roja gudivada amarnath inaugurate rushikonda buildings

Updated On : February 29, 2024 / 1:08 PM IST

Rushikonda Buildings: విశాఖపట్నంలో రుషికొండ ప్రాంతంలో నిర్మించిన భవనాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభోత్సవం చేసింది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఇతర మంత్రులు కలిసి గురువారం రుషికొండ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సువిశాలమైన ప్రాంతంలో వీటిని నిర్మించినట్టు చెప్పారు. ప్రభుత్వ భవనమైనా సాంప్రదాయ పద్ధతిలోనే ప్రారంభ వేడుక చేశామని తెలిపారు. అన్ని మత ప్రార్ధనలు జరిగాయని చెప్పారు.

ఈ భవంతులకు అన్ని అనుమతులు తీసుకున్నామని.. చివరిగా ఫైర్ విభాగం నుంచి కూడా అనుమతి వచ్చేసిందని వెల్లడించారు. ప్రస్తుతం టూరిజం ప్రాజెక్టుగా మాత్రమే ఈ భవనాలు పని చేస్తాయని తెలిపారు. మరి కొంత నిర్మాణం జరగాల్సి ఉందని, ఇప్పటికే ప్రభుత్వ అధికారుల బృందం కొన్ని సలహాలు ఇచ్చిందన్నారు. వారి సిఫారసుతో దీన్ని పరిపాలన భవనంగా వినియోగించే అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏ విధమైన కోర్టు ఇబ్బందులు ఈ భవనాలకు లేవని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.

Also Read: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి వేణుగోపాలకృష్ణ కౌంటర్

కేఏ పాల్ హంగామా
రుషికొండకు చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కారు దిగనివ్వకుండా పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన కారులో ఉండిపోయారు. పోలీసుల తీరుపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే ఆయన ప్రకటించారు.

Also Read: గోదావరి జిల్లాల్లో పొత్తు చిచ్చు..! సీట్ల సర్దుబాటుపై జనసైనికులకు ఉన్న అభ్యంతరాలేంటి?