డైట్, కాస్మొటిక్ ఛార్జీల బకాయిల విడుదలకు సీఎం చంద్రబాబు నిర్ణయం- మంత్రి సవిత
జాతీయ బీసీ కార్పొరేషన్ నుంచి ఏటా రూ.100 కోట్లు రాబట్టడానికి అవసరమైన మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం. బీసీ నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చే విధంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంను రూపొందిస్తాం.

Pending Dues And Funds (Photo Credit : Facebook)
Minister Savitha : బీసీ సంక్షేమ శాఖ, EWS సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించి బీసీల ఎదుగుదలకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న రూ.110 కోట్ల డైట్ ఛార్జీల బకాయిల విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే రూ.20.52 కోట్ల కాస్మొటిక్ ఛార్జీల బకాయిల విడుదలకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులకు రూ.10 కోట్లు విడుదల చేయనున్నారు.
”హాస్టల్ లో డిజిటిల్ కంటెంట్ తో విద్యా ప్రమాణాల పెంపుదలకు SR శంకరన్ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటుకు నిర్ణయం. ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్స్ నిమిత్తం కేంద్రం వాటా 133.78 కోట్లతో పాటు రాష్ట్ర వాటాగా 89.18 కోట్లు విడుదలకు నిర్ణయం. ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద నాణ్యమైన విదేశీ విద్యా సంస్థల్లో అత్యధిక మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా చర్యలు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధరణకు నిర్ణయం. బీసీ కార్పొరేషన్ పునర్ వ్యవస్థీకరణకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తాం. బీసీ ఉప కులాలు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు. వారి వృత్తులేంటి.. వారి తలసరి ఆదాయమెంత..? వంటి వివరాలకు సమగ్ర సర్వే చేస్తాం. ఈ సర్వే ఆధారంగా వారి ఆర్థిక పరిస్థితికి సమగ్ర కార్యాచరణ, ప్రణాళికలు సిద్ధం చేస్తాం.
జాతీయ బీసీ కార్పొరేషన్ నుంచి ఏటా రూ.100 కోట్లు రాబట్టడానికి అవసరమైన మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం. బీసీ నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చే విధంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంను రూపొందిస్తాం. బీసీ-ఏలో ఉన్న అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనుసంధానంతో SEED అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తాం. కులాల వారీగా తలసరి ఆదాయం ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను గుర్తించి వారి ఆర్థికాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తాం.
గత టీడీపీ ప్రభుత్వంలో 68 కాపు భవనాలకు అనుమతులు మంజారు చేయగా, వాటిలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా నిలిచిపోయిన 2 భవనాలను పూర్తి చేయడానికి రూ.2.36 కోట్లు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 66 కాపు భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందిస్తాం. రాష్ట్రంలోని అన్ని బీసీ గురుకుల విద్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు. సీసీ కెమెరాలను ఆర్టీజీఎస్ కు అనుసంధానం చేసి నిరంతరం మానిటరింగ్ చేస్తాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్మాణంలో ఉన్న 4 రెసిడెన్షియల్ స్కూళ్లు ( గుండుమల, గుదిబండ, గోనెబావి, రొద్దం) పూర్తి చేసి ఈ విద్యా సంవత్సరంలోనే వినియోగంలోకి తెస్తాం.
Also Read : పవన్ కల్యాణ్‌పై వైసీపీ వైఖరి మారిందా? ఏం జరుగుతోందో తెలుసా?
ఇందుకోసం రూ.75 కోట్లు విడుదల చేస్తున్నాం. రాష్ట్రంలో 5 చోట్ల ఫ్యాకల్టీ డెవలప్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన గురుకుల విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కోర్సులు నేర్పిస్తాం. చట్ట సభల్లో బీసీలకు ప్రాతినిథ్యం పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు సీఎం ఆదేశాలు ఇచ్చారు” అని మంత్రి సవిత తెలిపారు.