Vellampalli Srinivas : ప్రతి ఆలయంలో గోశాల, హిందువులకే ఉద్యోగాలు

ప్రతి ఆలయంలో గోశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గతంలో ఏ సీఎం కూడా దేవాదాయ శాఖపై కనీసం..

Vellampalli Srinivas : ప్రతి ఆలయంలో గోశాల, హిందువులకే ఉద్యోగాలు

Vellampalli Srinivas

Updated On : November 3, 2021 / 4:54 PM IST

Vellampalli Srinivas : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక మార్పులు తెచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆలయ భూముల లీజులు ఎగ్గొట్టే వారిపై చర్యలు తీసుకుంటున్నామని, అన్ని విభాగాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో విజిలెన్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తామన్నారు. దేవాలయాల అభివృద్ధికి ‘నాడు-నేడు’ తరహాలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. శాఖలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు.

Gmail Account : గూగుల్ కొత్త రూల్స్.. ఇకపై మీ జీమెయిల్ ఓపెన్ చేయాలంటే ఇది మస్ట్!

ప్రతి ఆలయంలో గోశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గతంలో ఏ సీఎం కూడా దేవాదాయ శాఖపై కనీసం పూర్తి స్థాయి రివ్యూ చేయలేదన్నారు. దేవాలయాలు, దేవతా మూర్తుల ప్రాశస్త్యం వివరించేలా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని 175 ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు నిర్వహించేలా.. డొనేషన్లు నేరుగా టెంపుల్ ఖాతాలోకి వెళ్లేలా చర్యలు చేపడతామన్నారు. ప్రతి ఆలయంలో ఆభరణాల వివరాలు డిజిటలైజ్ చేస్తున్నామని మంత్రి చెప్పారు.

Google Chrome Warn : క్రోమ్‌ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి!

దేవాదాయ శాఖలో వీలైనంత త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు. దేవాదాయ శాఖలో ఇతర శాఖల అధికారులను నియమించక తప్పని పరిస్థితి ఉందని… ఇతర శాఖలకు చెందిన హిందువులను మాత్రమే దేవదాయ శాఖలో నియమిస్తామని తెలిపారు.

WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. నో టైం లిమిట్.. ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు!

” దేవాదాయ శాఖ భూములను లీజు తీసుకుని చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని లీజు ఎగ్గొడుతున్నారు. అలాంటి వారి జాబితాను సిద్దం చేస్తున్నాం. లీజు ఎగొట్టే వారి నుంచి అవసరమైతే భూములు వెనక్కు తీసుకునేలా చర్యలు తీసుకుంటాం. దేవాదాయ శాఖలో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు చేర్పులు చేశాం. దేవాదాయ భూములను కాపాడేందుకు చట్ట సవరణలు సహా అనేక నిర్ణయాలు తీసుకున్నాం. దేవాదాయ శాఖలోని విజిలెన్స్ సెల్ ని మరింత బలోపేతం చేయనున్నాం. ఆలయాల్లో 100 శాతం సీసీ కెమెరాలు పెట్టేలా చర్యలు తీసుకుంటాం” అని మంత్రి చెప్పారు.