Earth Quake : ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు

ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగ కంపించింది. జిల్లాలోని పొదిలి,మర్రిపూడి,కొనకనమిట్ల,మాదిరెడ్డిపాలెం, చల్లగిరి మండలలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.దీంతో భయపడిన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.

Earth Quake : ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు

Prakasam District Earth Quakes

Updated On : June 18, 2022 / 4:04 PM IST

Earth Quake :  ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగ కంపించింది. జిల్లాలోని పొదిలి,మర్రిపూడి,కొనకనమిట్ల,మాదిరెడ్డిపాలెం, చల్లగిరి మండలలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.దీంతో భయపడిన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.

5సెకన్ల పాటు భూమి కంపిచడంతో ఇండ్లలోని వస్తువులు కిందపడి పొయాయి. కొన్ని ప్రాంతాల్లో గొడలు బీటలు పడ్డాయి. అయితే ఎవ్వరికి ఎటువంటి ప్రమాద సంఘటనలు చొటుచేసుకొలేదు. భూకంపం అని కొంతమంది గుర్తించలేక పొయ్యారు.

పొదిలిలో తాలుకాఫీసువీది, తూర్పుపాలెం, పిఎన్ ఆర్ కాలని మండలంలోని మాదిరెడ్డిపాలెం గ్రామంలో 5 సెకన్ల పాటు భూమి  కంపించిందని ప్రజలు చెపుతున్నారు. కొనకనమిట్ల మండలంలో గొట్లగట్టు, మర్రిపూడి మండలంలో గుండ్లసముద్రం వంటి ప్రాంతాల్లో భూమి కంపించింది.. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Also Read : Agnipath : అగ్నిపథ్ అల్లర్లు-రైలు నిలిపివేత-రోగి మృతి