Biyyapu Madhusudan Reddy : రజనీకాంత్ పై ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో రజనీకాంత్ ఎంతమంది పేద ప్రజలకు సహాయం చేశాడని ప్రశ్నించారు. ముసలి చంద్రబాబు నాయుడును విజన్ కలిగిన వ్యక్తి అని రజనీకాంత్ మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.

Biyyapu Madhusudan Reddy : రజనీకాంత్ పై ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Biyyapu Madhusudan Reddy

Updated On : April 30, 2023 / 8:35 PM IST

Biyyapu Madhusudan Reddy : సూపర్ స్టార్ రజనీకాంత్ పై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల గురించి రజనీకాంత్ కు ఏమి తెలుసు అని ప్రశ్నించారు. రజనీకాంత్ నిజాయితీ పరుడుగా మాట్లాడుతున్నాడు కానీ, ఆయనను నమ్ముకున్న వాళ్ళకి ఏమి చేశాడని నిలదీశారు. సినీ ఫీల్డ్ లో రజనీకాంత్ నీచుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాజకీయమంటే బీడీలు, సిగరెట్లు గాలిలో ఎగరేసి స్టైల్ గా తాగడం కాదని ఎద్దేవా చేశారు. సినీ ఫీల్డ్ నుంచి ఎదిగి రాజకీయంగా ఎంతోమంది ఎమ్మెల్యేలకు సహాయం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు. తమిళనాడులో రజనీకాంత్ ఎంతమంది పేద ప్రజలకు సహాయం చేశాడని ప్రశ్నించారు. ముసలి చంద్రబాబు నాయుడును విజన్ కలిగిన వ్యక్తి అని రజనీకాంత్ మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.

Andhra Pradesh: సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కొడాలి నాని, మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

రాజకీయ పార్టీ స్థాపిస్తానని మూడుసార్లు చెప్పి చివరకు హిమాలయాల్లో కూర్చున్నావని రజనీకాంత్ ను ఉద్దేశించి మాట్లాడారు. రజనీకాంత్ ఏపీ గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడి బినామీలు ఒక సినిమా తీస్తామని చెప్పడంతోనే డబ్బులకు ఆశపడి రజనీకాంత్ ఇలా మాట్లాడారని విమర్శించారు.

రజనీకాంత్ జయలలిత నుంచి నేర్చుకోవాలని సూచించారు. విజన్ గురించి మాట్లాడే రజనీకాంత్ పార్టీ ఎందుకు పెట్టలేదు? ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయారు? అని ప్రశ్నించారు. ఇకపై రజనీకాంత్ సినిమాలు చూడబోమని స్పష్టం చేశారు.