Vasantha Krishna Prasad : దేవినేని ఉమ లాంటి నాయకుడి వల్లే కృష్ణా జిల్లా టీడీపీ కకావికలం.. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
దేవినేని ఏం వ్యాపారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవినేని కుటుంబం నందిగామ, మైలవరం నియోజకవర్గానికి చెందిన వారు కాదని స్పష్టం చేశారు.

Krishna Prasad
Vasantha Krishna Prasad – Nandigama : మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వర రావుపై (Devineni Uma Maheshwara Rao) ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ( Vasantha Krishna Prasad) ఘాటు విమర్శలు చేశారు. ఒక్కసారి గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్ కు అంత బలుపా అని ఉమా మాట్లాడుతున్నాడు.. అవును వసంత కృష్ణ ప్రసాద్ కు బలుపే అని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. దేవినేని నాలుగు సార్లు గెలిచినా.. ఆయన గెలుపు ఎటువంటి గెలుపో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా (NTR District) నందిగామలో ఆయన మీడియాతో మాట్లాడారు.
దేవినేనిది అన్నావదినల బలిదానంతో గెలిచిన గెలుపు అని.. అది ఆయన గెలుపు కాదని ఎద్దేవా చేశారు. 2019లో మంత్రిగా ఉన్న దేవినేనిని 13,000 వేల మెజారిటీతో ఓడించిన గెలుపు అసలైన గెలుపు అని కృష్ణ ప్రసాద్ అన్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పినట్లు తాను కూడా ప్లాట్లు అమ్మినా, భూములు అమ్మినా, అపార్ల్ మెంట్లు నిర్మించి అమ్మినానని తెలిపారు.
Koram Kanakaiah : ఇల్లందు నియోజకవర్గంలో సర్వే అంటున్నారు.. ఎప్పుడు చేస్తారు?
దేవినేని ఏం వ్యాపారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవినేని కుటుంబం నందిగామ, మైలవరం నియోజకవర్గానికి చెందిన వారు కాదని స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గానికి చెందిన దేవినేని కుటుంబం కంచికచర్లలో కూల్ డ్రింక్స్ పెట్టుకుని బ్రతికారని.. అలాంటి దేవినేని ఉమ 5 సార్లు ఎలా పోటీ చేశారని ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డి లాగా పూలు అమ్మావా? పాలు అమ్మావా? చెప్పాలని కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు.
ఇసుక, మట్టి, అమ్ముకోవడం తప్ప..దేవినేని ఏ వ్యాపారం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. దేవినేని ఉమ వైసీపీ పార్టీకి అనుకూల శత్రువు అని పేర్కొన్నారు. దేవినేని ఉమ లాంటి నాయకుడు ఉండబట్టే కృష్ణా జిల్లా తెలుగు దేశం పార్టీ కకావికలం అయ్యిందని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని(Kodali Nani), వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi), ఇతర టీడీపీ (TDP) నాయకులు టీడీపీని వీడి వైసీపీలోకి రావడానికి కారణం దేవినేని ఉమనే అని కృష్ణ ప్రసాద్ ఆరోపించారు.
టీడీపీలో ఉన్న క్రియాశీలక నాయకులు పనిచేయకపోవడానికి కారణం దేవినేని ఉమ అంటూ వ్యాఖ్యలు చేశారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మళ్ళీ ఎమ్మెల్యే కావాలన్నా దేవినేని ఉమ సపోర్ట్ కావాలన్నారు. దేవినేని ఉమ నియోజకవర్గం వచ్చి వెళ్ళినప్పుడల్లా 500 టీడీపీ ఓట్లు పోవడం ఖాయమని కృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు.