MLA Nallapareddy : జగనన్న ఇళ్ల నిర్మాణం బాలేదు.. వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

నెల్లూరు జిల్లాలో హౌసింగ్ పై జరిగిన సమీక్షలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

MLA Nallapareddy : జగనన్న ఇళ్ల నిర్మాణం బాలేదు.. వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

Mla Nallapareddy

Updated On : June 26, 2021 / 4:04 PM IST

MLA Nallapareddy : నెల్లూరు జిల్లాలో హౌసింగ్ పై జరిగిన సమీక్షలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న ఇళ్లలో బెడ్ రూమ్స్ సరిగా లేవని ఆయన అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో 9 అంకణాల్లో ఇళ్ల నిర్మాణం చేపడితే, పట్టణాల్లో కేవలం 6 అంకణాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టడం బాగోలేదన్నారు. హౌసింగ్ సమీక్షలో మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జగనన్న ఇళ్లు బాగోలేవు అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీలో ప్రకంపనలు రేపాయి.