భయమెందుకు : సీఎంని నిలదీసిన రోజా

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 09:37 AM IST
భయమెందుకు : సీఎంని నిలదీసిన రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. వైసీపీ చీఫ్ జగన్‌పై దాడి కేసుని ఎన్ఐఏకు అప్పగించేందుకు ఎందుకు భయపడుతున్నారు అని సీఎంని ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను కూడా గౌరవించడం లేదని మండిపడ్డారు. ఎన్ఐఏ ధర్యాప్తుతో నిజాలు బటయకు వస్తాయని, కుట్రదారులు ఎవరో తెలిసిపోతుందని, అందుకే చంద్రబాబు భయపడుతున్నారని రోజా అన్నారు. జగన్‌పై దాడి వెనుక కుట్ర ఉందని, ఎయిర్‌పోర్టులో జగన్‌ను హత్య చేసేందుకు చూశారని రోజా ఆరోపించారు. జగన్‌పై దాడి జరుగుతుందని ముందే చెప్పిన నటుడు శివాజీని ఇప్పటివరకు ఎందుకు విచారించలేదని రోజా అడిగారు. అవినీతిపరులను కాపాడేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతమందిని ఫినిష్ చేస్తారు:
సీఎం చంద్రబాబు హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని రోజా మండిపడ్డారు. తప్పులను ఎత్తిచూపితే ఫినిష్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని అన్ని పనుల్లో అవినీతి జరుగుతోందని చెప్పిన బీజేపీ మహిళా కార్యకర్తను ఫినిష్ చేస్తానని చంద్రబాబు బెదిరించారని, ఇది ఎంతవరకు కరెక్ట్ అని రోజా నిలదీశారు. అసెంబ్లీలో కూడా చాలాసార్లు ప్రతిపక్షాన్ని చంద్రబాబు బెదిరించారని రోజా చెప్పారు.