Andhra Pradesh : పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం, ఏపీ పాఠశాల విద్యాశాఖ సంచలన ఆదేశాలు.. టీచర్లు తమ ఫోన్లు ఎవరికి ఇవ్వాలంటే

నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఏపీ పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. Andhra Pradesh Schools

Andhra Pradesh : పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం, ఏపీ పాఠశాల విద్యాశాఖ సంచలన ఆదేశాలు.. టీచర్లు తమ ఫోన్లు ఎవరికి ఇవ్వాలంటే

Andhra Pradesh Schools

Updated On : August 28, 2023 / 5:24 PM IST

Andhra Pradesh Schools : ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. స్కూల్స్ కు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తేవటంపై పూర్తి నిషేధం విధిస్తూ మెమో జారీ చేసింది. ఇక, ఉపాధ్యాయులు సైతం తరగతి గదుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

టీచర్లు తమ ఫోన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అప్పగించి క్లాస్ రూమ్ లకు వెళ్లాలని సూచనలు చేసింది. బోధనకు ఆటంకం రాకుండా ఉండేందుకు స్కూల్స్ లో సెల్ ఫోన్లను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వివరించింది. యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా పాఠశాల విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టింది.

Vijayawada : దుర్గగుడి పాలకమండలి కీలక తీర్మానాలు.. వృద్ధులు, వికలాంగులకు వాహనాలు.. ఏడాదిలోపు చిన్న పిల్లల తల్లులకు ప్రత్యేక క్యూలైన్

ఉపాధ్యాయ సంఘాలు ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పై అధికారులు ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.

టీచర్లు క్లాస్ రూమ్స్ లోకి వెళ్లే ముందు తమ ఫోన్లను హెడ్ మాస్టర్ కు అప్పగించాలి. ఆ తర్వాత క్లాస్ రూమ్స్ కు వెళ్లాలి. తరగతులు అన్నీ అయిపోయాక అంటే స్కూల్ మూసివేసిన తర్వాతే టీచర్లు తమ మొబైల్ ఫోన్లను తీసుకుని వెళ్లాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీచర్ల నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది. రకరకాల యాప్ లు పెట్టేసి అప్ లోడ్ చేయాలని ప్రభుత్వం ఇదివరకే టీచర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఫేషియల్ అటెండెన్స్, బాత్రూమ్ ల శుభ్రతకు సంబంధించిన ఫోటోలను ప్రతి రోజూ అప్ లోడ్ చేయాలని ప్రభుత్వం చెప్పింది. ఇవన్నీ చేయాలంటే నెట్ వర్క్ లేకపోవడం వల్ల తమకు చాలా సమయం వృథా అవుతోందని టీచర్లు వాపోతున్నారు.

Also Read..Cobra Video: 3 గంటల పాటు కాలిని చుట్టేసిన విషపూరిత పాము.. కదలలేక, అరవలేక అమ్మాయి

ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఫోన్లను హెడ్ మాస్టర్ కు ఇచ్చేయాలని ప్రభుత్వం చెప్పడం కరెక్ట్ కాదని టీచర్లు అంటున్నారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ అవసరం ఎంతైనా ఉంటుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఫోన్ల తమ దగ్గరే ఉంటే మంచిది అనే అభిప్రాయం టీచర్ల నుంచి వ్యక్తమవుతోంది. ఫోన్లు తమ దగ్గర పెట్టుకున్నంత మాత్రాన చదువు సరిగా చెప్పము అనే అభిప్రాయం కరెక్ట్ కాదంటున్నారు. ఈ విధానం సరైంది కాదని టీచర్లు అంటున్నారు. తమ ఇబ్బందులను, సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.