Mohan Babu : ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
నాయకులు ఓటర్లకి ఇచ్చేది మన డబ్బే. ఎవరు డబ్బులు ఇచ్చిన తీసుకోండి.. కానీ, బాగా ఆలోచించి ప్రజలకు మంచిచేసే నాయకుడ్ని ఎంపిక చేసుకొని ఓటు వేయండి అంటూ మోహన్ బాబు ఓటర్లకు సూచించారు.

Mohan Babu
Lok Sabha Elections 2024 : లోక్ సభ ఎన్నికలకు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికతోపాటు, ప్రచార పర్వానికి తెరలేపాయి. దేశవ్యాప్తంగానేకాక.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై సినీనటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాత్రి విద్యానికేతన్ లో నటుడు మోహన్ బాబు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మోహన్ బాబు రాజకీయాల గురించి మాట్లాడారు.
Also Read : Pawan Kalyan : ఎమ్మెల్యేగానా? ఎంపీగానా? పోటీపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్
ప్రాంతీయ పార్టీల గురించి నేను మాట్లాడను. ఒక్కోసారి మనం మోసపోతాం. ఒక పార్టీని తప్పుపట్టి మరోపార్టీకి ఓటు వేస్తాం. చివరకు ఆ పార్టీకూడా మనల్ని మోసం చేస్తుంది. నాయకులు ఓటర్లకి ఇచ్చేది మన డబ్బే. ఎవరు డబ్బులు ఇచ్చిన తీసుకోండి.. కానీ, బాగా ఆలోచించి ప్రజలకు మంచిచేసే నాయకుడ్ని ఎంపిక చేసుకొని ఓటు వేయండి అంటూ మోహన్ బాబు ఓటర్లకు సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. మోదీలాంటి వ్యక్తి మన దేశానికి కావాలి. మోదీని అనేకసార్లు కలిశాను. ఆయనతో మాట్లాడుతుంటే.. ఆయన విధానాలు చాలా గొప్పగా అనిపిస్తాయి అంటూ మోహన్ బాబు అన్నారు.