Pawan Kalyan : ఎమ్మెల్యేగానా? ఎంపీగానా? పోటీపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్

తన స్వస్థలంగా మార్చుకుంటానన్న పవన్ కల్యాణ్.. ఇక్కడి నుంచే ఏపీ భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

Pawan Kalyan : ఎమ్మెల్యేగానా? ఎంపీగానా? పోటీపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Clarity On Contest

Updated On : March 19, 2024 / 8:50 PM IST

Pawan Kalyan : ఎన్నికల్లో తన పోటీపై క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఇకపై తాను పిఠాపురంలోనే ఉంటానని పవన్ తేల్చి చెప్పారు. అంతేకాదు.. పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానన్న పవన్ కల్యాణ్.. ఇక్కడి నుంచే ఏపీ భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

దీంతో ఎంపీగా పోటీ చేస్తారా? లేక ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా? అనే సందిగ్థతకు పవన్ కల్యాణ్ తెరదించినట్లు అయ్యింది. మొత్తానికి పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై పిక్చర్ క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.