Nagababu Comments Minister Roja : మంత్రి రోజాపై నాగబాబు ఫైర్.. రోజా నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదు
ఏపీ మంత్రి రోజాపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఫైర్ అయ్యారు. రోజాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు ఏంటో రోజా తెలుసుకోవాలన్నారు.

NAGABABU
Nagababu Comments Minister Roja : ఏపీ మంత్రి రోజాపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఫైర్ అయ్యారు. రోజాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు ఏంటో రోజా తెలుసుకోవాలన్నారు. పర్యాటక శాఖ మంత్రి అంటే మీరు పర్యటనలు చేయడం కాదు అని రోజాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలని రోజాకు సూచించారు. చిరంజీవి, పవన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రోజా నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదని ఘాటుగా విమర్శించారు.
టాప్ 20 ర్యాంకింగ్స్ లో దేశంలో ఏపీ పర్యాటక శాఖ 18 స్థానంలో ఉందన్నారు. రోజా బాధ్యత మరిచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పర్యాటక శాఖ వల్ల ఎంతో మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా బ్రతుకుతున్నారు.. నీ చేష్టల వల్ల వారి బ్రతుకులు మరింత దిగజారిపోతున్నాయని పేర్కొన్నారు. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు.. పర్యాటక శాఖని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలన్నారు.
అంతకముందు మెగా ఫ్యామిలీపై మంత్రి రోజా విమర్శలు చేశారు. మెగాస్టార్ కుటుంబం ప్రజలకు ఏ చిన్న సాయం చేయలేదన్నారు. అందుకే ఆ ముగ్గురు అన్నదమ్ములను సొంత జిల్లాలో ప్రజలు ఓడించారని ఎద్దేవా చేశారు. ముగ్గురికీ రాజకీయాల్లో భవిష్యత్ లేదన్నారు. పవన్ కళ్యాణ్ సరైన సమయంలో స్పందిస్తే ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలుకుతారని తెలిపారు. నిజంగా పవన్ కళ్యాణ్ అంత మానవత్వం, ఏమోషన్స్ లేనివాడు ఒక ఆర్టిస్టు అయినందుకు ఆర్టిస్టుగా సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఆర్టిస్టులంటే చాలా సెన్సిటివ్ గా, చాలా ఎమోషనల్ గా ఉంటారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్, జయలలిత ఎంత స్థాయిలో ఉన్నా.. వారు అవన్నీ వదులుకున్నారని.. పదవులు ఇచ్చిన ప్రజలకు ప్రజలకు సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసా పొంది సీఎంలు అయ్యారని గుర్తు చేశారు. కానీ ఈ ముగ్గురి కుటుంబంలో ఎవరు ఎందుకు సీఎం కాలేదంటే వీరిని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు కనీసం ఇప్పటిరవకు ఏ చిన్న సాయం కూడా స్వంత జిల్లాలో చేయలేదని చెప్పారు. కాబట్టే అన్నదమ్ములు ముగ్గురిని స్వంత జిల్లా స్వంత నియోజకవర్గంలో ప్రజలు ఓడిచారంటేనే వారి స్థాయి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. మంత్రి రోజా వ్యాఖ్యలకు జనసేన నేత నాగబాబు కౌంటర్ ఇచ్చారు.