ఏపీని మోదీకి తాకట్టు పెడుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్: ఎంపీ మార్గాని భరత్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? విలువలు విశ్వసనీయత అనే పదాలకు అర్థం చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేరు.

ఏపీని మోదీకి తాకట్టు పెడుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్: ఎంపీ మార్గాని భరత్

Margani Bharat : చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టాలనుకుంటున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న చిలకలూరిపేటలో జరిగిన మూడు పార్టీల సభ ఫ్లాప్ అయిందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి సభలో మైకులు పనిచేయలేదని.. పరిస్థితులు, దేవుడు కూడా వారి పక్షాన లేరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును అక్రమ కలయికగా వర్ణించారు.

”గతంలో చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చాలా అనరాని మాటలు అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? విలువలు విశ్వసనీయత అనే పదాలకు అర్థం చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేరు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తులు కాదు. పార్లమెంట్లో పాస్ అయిన బిల్లులకు కూడా ఈ రోజుకి అతి గతి లేదు. విభజన హామీలను ఇంకా అమలు చేయలేదు.మోసం చేయడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.

మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి పెద్ద కొడుకు లాగా వ్యవహరిస్తున్నారు. రాజమండ్రిలో గంజాయి బ్యాచ్‌కి డాన్ ఆదిరెడ్డి శ్రీనివాస్. అధిక వడ్డీలతో పేదవాళ్లు స్థలాలు లాక్కున్న చరిత్ర ఆదిరెడ్డి కుటుంబానిది. నా గురించి మాట్లాడే అర్హత వాళ్లకు లేదు. రాజమండ్రిలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు నడుస్తున్నాయంటే కారణం ఆదిరెడ్డి కుటుంబమేన”ని ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు.

Also Read: వైసీపీ ప్రచార వ్యూహం.. సింగిల్‌గా, పక్కా ప్రణాళికతో జనాల్లోకి సీఎం జగన్‌