బిగ్ బ్రేకింగ్ : సీఎం జగన్‌తో ముఖేష్ అంబానీ భేటీ

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. 2020, ఫిబ్రవరి 29వ తేదీ శనివారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరిద్దరూ చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ముఖేశ్ కుమారుడు అనంత్ అంబానీ, ఎంపీ పరిమల్ నత్వానీ పాల్గొన్నారు. వీరిద్దరి భేటీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Also Read | సీఎం జగన్ పబ్జీ గేమ్ ఆడుతారంటున్న లోకేష్
ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ సంకల్పిస్తున్నారు. అందులో భాగంగా అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరింప చేసేందుకు మూడు రాజధానుల ప్రటకన చేశారు. విశాఖపట్టణాన్ని ఏపీ కేపిటల్‌గా గుర్తించారు.
ఇదిలా ఉంటే…ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంటకు రూ. 15 వందల కోట్ల పెట్టుబడితో రావాల్సిన రిలయన్స్ పరిశ్రమల వెనక్కి వెళుతాయనే ప్రచారం జరిగింది. రిలయన్స్‌కు గత ప్రభుత్వం భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్..అంబానీ భేటీల మధ్య ఈ అంశం చర్చకు వచ్చిందా ? అనేది తెలియాల్సి ఉంది.
ప్రపంచంలోని అపర కుబేరుల జాబితాలో ఇండియన్ రిచ్చెస్ట్ పర్సన్ ముకేశ్ అంబానీ చేరిన సంగతి తెలిసిందే. ఈయన సంపాదన అక్షరాల గంటకు ఏడు కోట్ల రూపాయలు. ఆసియాలోని బిలియనీర్స్ లిస్ట్‌లో ముఖేశ్ అంబానీ గత కొన్ని సంవత్సరాలుగా అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈయన ఆస్తుల విలువ అక్షరాల రూ. 67 బిలియన్ డాలర్లు.