Balakrishna: ఈ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం: బాలకృష్ణ, అచ్చెన్నాయుడు

గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2న) చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు.

Balakrishna: ఈ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం: బాలకృష్ణ, అచ్చెన్నాయుడు

Atchannaidu, Balakrishna

Updated On : September 30, 2023 / 3:57 PM IST

Atchannaidu: మేలుకో తెలుగోడా అనే నినాదంతో ముందుకు వెళతామని టీడీపీ నేతలు నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు అన్నారు. జనసేన, టీడీపీ కలిసి పోరాడతాయని చెప్పారు. ఏపీలోని నంద్యాలలో ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది.

ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం బాలకృష్ణ, అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. అక్రమంగా కేసులు పెడుతున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని అన్నారు. చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్ట్ చేశారని చెప్పారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన 97 మంది అభిమానుల కుటుంబాల సభ్యులను చంద్రబాబు బయటకు వచ్చాక కలిసి పరామర్శిస్తామని చెప్పారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. తమ పార్టీ శ్రేణులు కూడా జనసేన వారాహి యాత్రలో పాల్గొంటారని చెప్పారు. గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2న) చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు.

నేటి నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగుతాయని తెలిపారు. 2వ తేదీన సాయంత్రం ప్రతి ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి, కొవ్వొత్తులతో అందరూ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే టీడీపీ, జనసేన సభ్యులతో జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుందని తెలిపారు. తాము గ్రామ, మండల, నియోజక వర్గ స్థాయిలో కలిసి పనిచేస్తామని అన్నారు.

Ram Mohan Naidu: దీన్ని చూసి జగన్‌కు భయం పట్టుకుంది: ఎంపీ రామ్మోహన్ నాయుడు