Nara Bhuvaneswari : రైలు ప్రమాదంపై నారా భువనేశ్వరి దిగ్బ్రాంతి.. ప్రభుత్వాన్ని ఏం కోరారంటే..
విజయనగరం రైలు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Nara Bhuvaneswari
Viziangaram Train Accident : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి – ఆలమండ మధ్య ఆదివారం రాత్రి 7గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మరణించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో వంద మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయనగరం రైలు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రైలు ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని భువనేశ్వరి తెలియజేశారు. అయితే, ఆమె ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.