Nara Lokesh : వేయని రింగ్ రోడ్డు కేసులో నన్ను ఏ14గా చేర్చారు : నారా లోకేశ్

అసలు వేయిన రింగు రోడ్డుకు నన్ను ఏ14గా చేర్చారు. యువగళం పాదయాత్ర పేరు వింటేనే జగన్ భయపడిపోతున్నారు.

Nara Lokesh : వేయని రింగ్ రోడ్డు కేసులో నన్ను ఏ14గా చేర్చారు : నారా లోకేశ్

Nara lokesh

Nara Lokesh Amaravati inner ring road case as A14 : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ను A14గా పేర్కొంటు సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. దీనిపై నారా లోకేశ్ స్పందించారు.అసలు వేయిన రింగు రోడ్డుకు నన్ను ఏ14గా చేర్చారు. యువగళం పాదయాత్ర పేరు వింటేనే జగన్ భయపడిపోతున్నాడని..పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామనే భయంతోనే నాపై ఈ కేసు పెట్టారని విమర్శించారు లోకేశ్. యువగళం తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించేసరికి నా శాఖకు సంబంధంలేనిదాన్ని.. అసలు రోడ్డే వేయిని రింగ్ రోడ్డు కేసులో నన్ను ఏ14గా చేర్చారు ఇదంతా జగన్ చేసే కుట్ర అంటూ మండిపడ్డారు.

తన పాదయాత్ర సాగే ప్రాంతాల్లో అన్యాయంగా నిర్బంధాలు విధించారని..దాంట్లో భాగంగానే రిపేర్లు పేరుతో రాజమండ్రి బ్రిడ్జిని మూసేయించారని విమర్శించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అరెస్టులు చేయించినా యువగళం ఆగదు అంటూ స్పష్టంచేశారు. యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారని..ఎన్ని ఇబ్బందులు సృష్టించినా..ఎన్ని కేసులు పెట్టినా తన పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. తన పాదయాత్ర తిరిగి ప్రారంభం కాకూడదని జీవో 1 తెచ్చినా…ఆగేది లేదన్నారు.

Nara Lokesh : ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో A14గా లోకేశ్, ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో

చంద్రబాబు అరెస్ట్ తో తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చానని..కానీ ఎట్టి పరిస్థితుల్లోను పాదయాత్రను మధ్యలో వదిలేది లేదన్నారు. యువగళం తిరిగి ప్రారంభింస్తామనేసరికి తన శాఖకు సంబంధం లేని, అసలు వేయని రింగ్ రోడ్డు కేసులో తనను ఈ 420 సీఎం ఏ14గా చేర్పించారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా జన చైతన్యమే యువగళాన్ని వినిపిస్తుందన్నారు.