Nara Lokesh : మూడుసార్లు ప్రమాదం నుంచి తప్పించుకున్న నారా లోకేశ్

యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద ఘటనలతో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Nara Lokesh : మూడుసార్లు ప్రమాదం నుంచి తప్పించుకున్న నారా లోకేశ్

Nara Lokesh Yuva Galam Padaytara at Darsi

Nara Lokesh Yuva Galam Padaytara at Darsi : యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ప్రమాదం తప్పింది. యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈక్రమంలో దర్శి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్రలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఆయనతోకలిసి ఫోటోలు తీససుకోవటానికి పోటీలు పడ్డారు. ఈక్రమంలో పాదయాత్ర సందర్భంగా జనం ఒక్కసారిగా మీదపడడంతో లోకేశ్ ఉక్కిరిబిక్కిరయ్యారు. మూడు సార్లు కిందపడబోయారు.దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమై పట్టుకోవటంతో ప్రమాదం తప్పింది. లేదంటే ఆ భారీ సమూహంలో కిందపడితే గాయాలు అయ్యే అవకాశం ఉంది. భారీ తోపులాటతో లోకేశ్ నిభాయించుకున్నా మూడుసార్లు కిందపడబోయారు. దీంతో ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తమై పట్టుకోవటంతో ప్రమాదం తప్పింది.

Chandrababu : తెలుగు నేలకు జలహారం పేరుతో.. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన

యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ క్రమంలో ప్రజలు భారీగా తరలిరావటంతో తోపులాటో ఆయన కిందపడబోయారు. లోకేశ్ కు పోలీసు సిబ్బందిని ఇవ్వకపోవటంవల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని కావాలనే వైసీపీ ప్రభుత్వం పాదయాత్రకు పోలీస్ సిబ్బందిని తగ్గించిందని ఆరోపించారు.ఉన్న పోలీసు సిబ్బంది జనాన్ని అదుపు చేయడంలో విఫలమవుతోందని విమర్శించారు టీడీపీ నేతలు. పోలీసులు కావాలనే లోకేశ్ కు భద్రత కల్పించడంలేదని ఆరోపణలు చేశారు. వైసీపీ పెద్దల ఒత్తిడితోనే లోకేశ్ పాదయాత్రకు భద్రత తగ్గించారని టీడీపీ మండిపడింది. కందుకూరు, గుంటూరు తరహా ఘటనలు మరోసారి జరిగేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. జనం తోపులాటల్లో లోకేశ్ కాళ్లకు, చేతులకు తరచుగా గాయాలవడం పట్ల టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Janasena : వాలంటీర్ చేసిన హత్యకు బాధ్యత ఎవరు తీసుకుంటారు జగన్? ముఖ్యమంత్రిని నిలదీసిన పవన్ కల్యాణ్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 17 రోజుల పాటు సాగిన పాదయాత్ర కొనసాగింది. 171వ రోజు దర్శి నియోజకవర్గంలో ప్రజలు అత్యంత భారీగా తరలిరావటంతో పాదయాత్ర హోరెత్తింది. అలాగే ముండ్లమూరులో కూడా విశేష స్పందన వచ్చింది.