Naralokesh : నా తల్లిని కించపరిచిన వాళ్లను వదలా

నా తల్లిని కించపరిచిన వాళ్లను మా నాన్న వదిలినా...తాను వదలనని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

Naralokesh : నా తల్లిని కించపరిచిన వాళ్లను వదలా

Nara

Updated On : December 22, 2021 / 1:37 PM IST

Nara Lokesh Angry : నా తల్లిని కించపరిచిన వాళ్లను మా నాన్న వదిలినా…తాను వదలనని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మీ ఇంట్లో ఆడవాళ్ల గురించి…ఇలాగే మాట్లాడుతారా అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నిబద్ధతతో ప్రజాసేవ చేస్తున్న వ్యక్తిని బయటకు లాగుతారా అని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. 2021, డిసెంబర్ 22వ తేదీ బుధవారం ఆయన మంగళగిరికి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉద్వేగానికి లోనయిన సంగతి తెలిసిందే.

Read More : Kandi Farming: గిరిజన గూడాల్లో సిరులు కురిపిస్తున్న కందిసాగు

రెండున్నరేళ్లుగా ఎన్నో అవమానాలను భరించానని.. తన భార్యపై కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తాను సీఎంగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టనంటూ..శపథం చేస్తూ..వెళ్లిపోయారు. అనంతరం మీడియా ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. కొద్ది రోజుల అనంతరం కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దీనిపై విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి క్షమాపణలు కూడా చెప్పారు. భువనేశ్వరిపై పొరపాటున వ్యాఖ్యలు చేశానన్న వంశీ.. తన వ్యాఖ్యలతో ఎవరినైనా బాధపెట్టి ఉంటే తనను క్షమించాలన్నారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అనుకున్నారు.

Read More : Made in Telangana: ఆన్‌లైన్‌లో మేడ్ ఇన్ తెలంగాణ ప్రొడక్ట్స్

ఈ క్రమంలో..నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో నిబద్ధతతో నిజాయితీతో ప్రజా సేవ చేస్తున్న తమ కుటుంబాన్ని బయటి లాగటానికి వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. రానున్న కాలంలో తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయించిన ప్రభుత్వం నేడు సొంతపార్టీ వాళ్ల మీద దాడులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని లోకేష్ విమర్శించారు. దీంతో మరోసారి టీడీపీ – వైసీపీ నేతల మధ్య మరోసారి మాటల తూటాలు పేలే అవకాశం ఉంది.