Nara Lokesh : అనారోగ్య కారణాలతో చంద్రబాబుని అంతమొందించే కుట్ర జరుగుతోంది : లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్ర‌బాబుని అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే కుట్ర జరుగుతోంది అంటూ అత్యంత సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేశ్.భ‌ద్ర‌త‌లేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయ‌న‌కి ప్రాణ‌హాని తల‌పెడుతున్నారు అంటూ మండిపడ్డారు.

Nara Lokesh : అనారోగ్య కారణాలతో చంద్రబాబుని అంతమొందించే కుట్ర జరుగుతోంది : లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

Chandrababu Health Condition

Nara Lokesh allegations on YCP Govt : చంద్రబాబుకు జైల్లో సరైన వైద్యం అందటంలేదని..వైద్యం అందించటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటూ నారా భువనేశ్వరి ఆరోపించారు. చంద్రబాబు ప్రాణాలకు జైల్లో ముప్పు ఉందంటూ నారా బ్రాహ్మణి ఆరోపించారు. ఇలా చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనగా ఉందంటూ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తి పైగా 73 ఏళ్ల వయస్సున్న వ్యక్తిని కావాలనే కక్షపూరితంగా హింసిస్తున్నారంటూ వాపోతున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు కుమారుడు లోకేశ్ చంద్రబాబు ఆరోగ్యం విషయంలో కావాలనే కుట్రం చేస్తున్నారని ఆరోపించారు. వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్ర‌బాబుని అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే కుట్ర జరుగుతోంది అంటూ అత్యంత సంచలన ఆరోపణలు చేశారు.భ‌ద్ర‌త‌లేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయ‌న‌కి ప్రాణ‌హాని తల‌పెడుతున్నారు అంటూ మండిపడ్డారు.

Balakrishna : చంద్రబాబుని అనారోగ్యం పాలు చేసేందుకు కుట్రలు, ఏమైనా జరిగితే జగన్‌దే బాధ్యత- ఎమ్మెల్యే బాలకృష్ణ

ఎన్న‌డూ ఏ త‌ప్పూ చేయ‌ని 73 ఏళ్ల చంద్ర‌బాబు ప‌ట్ల వైసీపీ ప్రభుత్వం రాక్ష‌సంగా వ్య‌వ‌హ‌రిస్తోందని..చంద్ర‌బాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్ప‌దంగా ఉంది అంటూ అనుమానాలు వ్యక్తంచేశారు.జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న చంద్ర‌బాబుని ముద్దాయి అని హెల్త్ బులెటిన్లో ప‌దే ప‌దే పేర్కొనేందుకు పెట్టిన శ్ర‌ద్ధ ఆయ‌న ఆరోగ్యం, భ‌ద్ర‌త‌పై పెట్ట‌డంలేదని వాపోయారు.చంద్ర‌బాబుకి ఏ హాని జ‌రిగినా, జ‌గ‌న్ స‌ర్కారు, జైలు అధికారుల‌దే బాధ్య‌త‌.అని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష? దోమలు ఎక్కువ ఉన్నాయన్నా పట్టించుకోలేదు,చన్నీళ్ళు ఇస్తున్నారనన్నా లెక్క చేయలేదు,సరిగా తిరగని ఫ్యాన్ పెట్టారు, చంద్రబాబు బరువు తగ్గిపోయారు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన వయస్సును కూడా పరిగణలోకి తీసుకోవటంలేదని వాపోయారు.

 

Also Read : జైలులో చంద్రబాబుకు ఏసీ పెట్టటానికి అదేమన్నా అత్తారిల్లా..? : సజ్జల సెటైర్లు

అలాగే..చంద్రబాబుని అనారోగ్యం పాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ నేత బాలకృష్ణ  ఆరోపించారు. చంద్రబాబుకి ఏమైనా జరిగితే సీఎం జగన్ దే బాధ్యత అన్నారు బాలకృష్ణ. అభివృద్ధిలో చంద్రబాబుని ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసినా జగన్ పగ చల్లారినట్టు లేదన్నారు. చంద్రబాబుని ప్రజల నుంచి దూరం చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కుట్రలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. 73 ఏళ్ల చంద్రబాబు ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని… స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకి 34 రోజులుగా జైల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆయన్ను అనారోగ్యం పాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.