Nara Lokesh : సీపీఐ నారాయణకు ధన్యవాదాలు తెలిపిన నారా లోకేశ్
జగన్ అరాచక పాలనపై కలిసి పోరాడతామని సీపీఐ నారాయణ లోకేశ్ కు తెలిపారు.

Nara Lokesh CPI Narayana
Nara Lokesh CPI Narayana : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ తరువాత సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నారా లోకేశ్ కు ఫోన్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేయటంపై లోకేశ్ తో మాట్లాడారు. ఫోన్ చేసిన నారాయణ చంద్రబాబునుఅరెస్ట్ చేయటం దారుణమని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ బంద్ కు టీడీపీ ఇచ్చిన పిలుపుకి బంద్ కు సీపీఐ మద్దతు తెలుపుతోందని తెలిపారు. లోకేశ్ కు నారాయణ ధైర్యం చెప్పారు. జగన్ల అరాచక పాలనపై కలిసి పోరాడతామని తెలిపారు. దీంతో సీపీఐ నారాయణకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందని భారీగా నిధులు దారి మళ్లాయని దీంట్లో చంద్రబాబు ప్రధాన సూత్రదారి అనే ఆరోపణలో ఏపీ సీబీఐ చంద్రబాబును అరెస్ట్ చేసింది. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబుకు రిమాండ్ తప్పదని భావించిన టీడీపీకి..ఆయన కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. రిమాండ్ విధించకుండా విడుదల చేస్తుందని భావించటంతో కోర్టు అనూమ్యంగా రిమాండ్ విధించటంతో షాక్ అయ్యారు.
Chandrababu : చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్
ఏసీబీ కోర్టు అనూమ్యంగా రిమాండ్ విధించటంతో చంద్రబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రోడ్డు మార్గాన పోలీసులు చంద్రబాబును తరలించారు.