నిధులు లేవని బుగ్గన చెప్పడం సిగ్గుచేటు: లోకేశ్

నిధులు లేవని బుగ్గన చెప్పడం సిగ్గుచేటు: లోకేశ్

Updated On : September 12, 2019 / 7:05 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల్లేవంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల మీటింగ్‌కు ఆంధ్రప్రదేశ్ తరపున హాజరైన బుగ్గన ఈ వ్యాఖ్యలు చేయడంపై తెదేపా నేత లోకేశ్ స్పందించారు. అధికారిక ట్విట్టర్ ద్వారా ఓ పోస్టు చేశారు.

వైసీపీ ప్రభుత్వం నిధుల్లేవని కావాలనే చెప్తుందని దానికి బదులు నిర్మాణం తమకు ఇష్టం లేదని చెప్పొచ్చు కదా అంటూ లోకేశ్ ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లినప్పుడు ఏపీ సీఎం జగన్ నిధులు ఇప్పుడే అవసర్లేదని చెప్పారని తెలియజేశారు. ట్విట్టర్‌లో చేసిన పోస్టులో వివరాలు ఇలా ఉన్నాయి.

‘అమరావతి నిర్మాణానికి నిధుల్లేవని భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సు వేదికగా బుగ్గనగారు చెప్పడం సిగ్గుచేటు. దానికి బదులు మాకిష్టం లేదని చెప్పాల్సింది. ప్రధాని దగ్గరకు వెళ్ళి రాజధాని నిర్మాణానికి ఇప్పుడే నిధులు ఇవ్వక్కరలేదని @ysjagan గారు చెప్పొచ్చారు. గుర్తులేదా బుగ్గనగారు?’ అంటూ ట్వీట్ చేశారు.