చంద్రబాబు ఎందుకు పర్యటిస్తున్నారో.. జగన్ ఎందుకు పర్యటిస్తున్నారో చూడండి: నారా లోకేశ్
Nara Lokesh: ప్రతి నాయకుడు జగన్ తొలి జిల్లా పర్యటన ఎలాగుందో చూడండంటూ లోకేశ్ పలు వ్యాఖ్యలు చేశారు.

Nara Lokesh
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని నాయకుడు అంటూ, మాజీ సీఎం జగన్‌ను ప్రతినాయకుడు అంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. చంద్రబాబు చేస్తున్న పర్యటనలు, జగన్ చేస్తున్న పర్యటనలను పోల్చుతూ లోకేశ్ పలు వ్యాఖ్యలు చేశారు.
నాయకుడు చంద్రబాబు నాయుడి తొలి ఢిల్లీ పర్యటనలో అధికారులు, ఎంపీలు, మంత్రులతో కలిసి ఉందని నారా లోకేశ్ చెప్పారు. వారు కేంద్ర మంత్రులతో సమావేశం జరిపారని అన్నారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు పై చర్చలు జరిగాయని అన్నారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర తక్షణ అవసరాలపై విన్నపం చేశారని తెలిపారు.
ప్రతి నాయకుడు జగన్ తొలి జిల్లా పర్యటన ఎలాగుందో చూడండంటూ లోకేశ్ పలు వ్యాఖ్యలు చేశారు. అక్రమాలు, అరాచకాల్లో ఆరితేరి పల్నాడును రావణకాష్టం చేసి, పాపం పండి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పరామర్శించారని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ సీఎం పెట్టుకున్న తొలి పర్యటన నెల్లూరు జిల్లా జైలు అని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు మలిపర్యటనలో తెలంగాణ సీఎంతో భేటీ అవుతున్నారని తెలిపారు. విభజన చట్టంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నారని అన్నారు.
జగన్ మలి పర్యటన మాత్రం బాలికను లైంగికంగా వేధించి పోక్సో చట్టం కింద అరెస్టై కర్నూలు జైలులో ఉన్న తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే వద్దకు అని నారా లోకేశ్ చెప్పారు.
నాయకుడు – ప్రతి నాయకుడు#NCBN #AndhraPradesh pic.twitter.com/dlxQRhmvqw
— Lokesh Nara (@naralokesh) July 5, 2024
Also Read: ఏపీని గ్లోబల్ లీడర్ చేయడమే లక్ష్యం- సీఎం చంద్రబాబు నాయుడు